ETV Bharat / city

రాష్ట్రంలో తక్కువ ధరకే టమాటా... ఎప్పటినుంచో తెలుసా..! - పెరిగిన టమాటా ధరపై ప్రభుత్వం దృష్టి

Tomato prices: టమాటా.. ప్రతి ఇంట్లో ఏదో విధంగా ఉపయోగించే కూరగాయల్లో ఒకటి. అయితే టమాటా ధరలు మాత్రం విచిత్రంగా మారుతుంటాయి. ఒకసారి కనీస ధర కూడా రావడం లేదని మార్కెట్​లోనే రైతులు పడేసి పోతుంటారు. మరోసారి భారీ ధర పలుకుతుంటుంది. ఒక్కోసారి రూ.వంద వరకు చేరుతుంటుంది. ప్రస్తుతం ఇదే పరిస్థితి కొనసాగుతోంది.. అన్ని ప్రాంతాల్లో దాదాపు కిలో టమాటా రూ.70 వరకు పలుకుతోంది. దీంతో ప్రజలు టమాటాలు కొనేందుకే భయపడుతున్నారు. ప్రజలకు కాస్త ఊరట కలిగించేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. రేపటి నుంచి తక్కువ ధరలకే విక్రయించాలని నిర్ణయించింది.

Tomato prices
రాష్ట్రంలో తక్కువ ధరకే టమాట
author img

By

Published : May 19, 2022, 5:18 PM IST

Tomato prices: వేసవి కాలం కావడంతో కూరగాయల దిగుబడులు తగ్గిపోయాయి. వాటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అయితే పెరిగిన టమాటా ధరలపై ప్రభుత్వం దృష్టి సారించింది. రేపటినుంచి తక్కువ ధరలకు టమాటా విక్రయిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వమే స్వయంగా పక్క రాష్ట్రాల నుంచి టమాటాను కొనుగోలు చేసి.. రాష్ట్రంలోని అన్ని రైతు బజార్ల ద్వారా విక్రయించాలని నిర్ణయించినట్లు చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని రైతు బజార్లలో మే 20 నుంచి తక్కువ ధరలకు టమాటాలు విక్రయిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. బహిరంగ మార్కెట్​లో టమాటా ధర భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రజలకు తక్కువ ధరలకే టమాటాను విక్రయించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. వేసవిలో రాష్ట్రంలో టమాటా ఉత్పత్తులు తగ్గాయని... పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుని ప్రైవేటు వ్యాపారులు అధిక ధరలకు విక్రయించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు మంత్రి తెలిపారు. బహిరంగ మార్కెట్​లో టమాటా ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వమే స్వయంగా పక్క రాష్ట్రాల నుంచి టమాటాను కొనుగోలు చేసి.. రాష్ట్రంలోని అన్ని రైతు బజార్ల ద్వారా విక్రయించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.