ETV Bharat / city

Kondapalli Municipality: కొండపల్లి పురపాలిక ఛైర్మన్‌ ఎన్నికపై ప్రభుత్వం అప్పీల్ - ap high court on kondapalli municipality

sonusood phone call to tdp chief chandrababu

author img

By

Published : Nov 21, 2021, 10:39 PM IST

Updated : Nov 21, 2021, 11:07 PM IST

22:29 November 21

హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులపై అప్పీలు చేసిన ప్రభుత్వం

కొండపల్లి పురపాలిక ఛైర్మన్‌ ఎన్నిక(chairman of kondapalli municipality )పై ప్రభుత్వం అప్పీలు చేసింది. హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులపై డివిజన్ బెంచ్​ను ఆశ్రయించింది(ap high court on kondapalli municipality ). ఈ మేరకు అత్యవసరంగా విచారించాలని కోరుతూ పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి ఈ పిటిషన్​ను దాఖలు చేశారు. పిటిషన్‌ పై అత్యవసర విచారణకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిరాకరించారు.  

కేసు వివరాలు ఇలా..!
కొండపల్లి పురపాలిక ఛైర్మన్​ ఎన్నికలో భాగంగా ఎక్స్‌అఫీషియో ఓటు వేసేందుకు తనను అనుమతించాలని కోరుతూ తెదేపా ఎంపీ కేశినేని నాని(mp kesineni nani) హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన న్యాయస్థానం.. ఓటు వేసేందుకు ఎంపీకి అనుమతించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ.. ప్రభుత్వం అప్పీల్​కు వెళ్లింది.

ఛైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ.. ఎందుకంటే..
కృష్ణా జిల్లాలోని  కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక రసవత్తరంగా(Kondapalli Municipal Chairman election) మారుతోంది. సోమవారం ఎన్నిక జరగనుంది. ఈ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 29 వార్డులున్నాయి. ఇటీవల జరిగిన నగరపంచాయతీ ఎన్నికల్లో తెదేపా, వైకాపా.. 14 వార్డుల చొప్పున గెలుపొందాయి. మిగిలిన స్థానంలో గెలిచిన స్వతంత్య్ర అభ్యర్థి.. తెదేపాకు మద్దతునివ్వడంతో.. ఆ పార్టీ సీట్ల సంఖ్య 15కు పెరిగింది. మరోవైపు స్థానిక ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్​ ఎక్స్ అఫీషియో ఓట్లు వినియోగించుకోనున్నారు. దీంతో.. తెదేపాకు 16, వైకాపాకు 15 సీట్లు దక్కే అవకాశం ఏర్పడింది. ఈ క్రమంలో.. ఛైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది.

ఇదీ చదవండి

Kondapalli Municipal Chairman: ఉత్కంఠ రేపుతోన్న.. కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక

Last Updated : Nov 21, 2021, 11:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.