ETV Bharat / city

ప్రభుత్వ ఉద్యోగాల వయో పరిమితి పెంపు ఉత్తర్వులు కొనసాగింపు

author img

By

Published : Oct 1, 2022, 10:06 AM IST

ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్దుల వయో పరిమితి పెంపులో.. ప్రభుత్వం గత ఉత్తర్వులనే కొనసాగించాలని నిర్ణయించింది. ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే వారి వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 42 ఏళ్లకు పెంచుతూ.. గతేడాది జారీ చేసిన 105 జీవోను పొడిగిస్తూ, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Etv Bharat
Etv Bharat

ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్దుల వయో పరిమితి పెంపు వెసులు బాటును పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2021 సెప్టెంబర్ 27 న జారీ చేసిన జీవో 105ను మరో ఏడాది పాటు కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే వారి వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 42 ఏళ్లకు పొడిగించింది. 2023 సెప్టెంబర్ వరకు ఈ మినహాయింపు అమల్లో ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏపీపీఎస్సీ సహా మిగతా ప్రభుత్వ నియామక సంస్థలు ఈ అంశాన్ని నోటిఫై చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అటు ఏపీపీఎస్సీ నిర్వహించే గ్రూప్ -1 ఉద్యోగాలకు మళ్లీ ఇంటర్వ్యూ లు నిర్వహించాలని సర్కారు నిర్ణయించింది. గతంలో రద్దు చేసిన ఇంటర్వ్యూ విధానాన్ని పునరుద్దరిస్తూ ఉత్తర్వులిచ్చింది.

ఇవి చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.