ETV Bharat / city

'అనుమతులు రాగానే ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స'

కొవిడ్-19 చికిత్సకు సంబంధించి అనుమతులు రాగానే ప్లాస్మా థెరపీని చేపట్టేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం కరోనా నుంచి కోలుకున్న రోగుల నుంచి ప్లాస్మాను సేకరిస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు ప్లాస్మా థెరపీ కోసం ఐసీఎంఆర్ అనుమతి కోసం ఎదురు చూస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో పరీక్షల సామర్థ్యాన్ని పెంచుకునేలా వైద్యారోగ్యశాఖ కార్యాచరణ ముమ్మరం చేసింది.

'అనుమతులు రాగానే ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స'
'అనుమతులు రాగానే ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స'
author img

By

Published : May 2, 2020, 12:02 AM IST

ఐసీఎంఆర్​ అనుమతులు రాగానే ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స

రాష్ట్రంలో కరోనా చికిత్సలో భాగంగా ప్లాస్మా థెరపీని వినియోగించాలని వైద్యారోగ్యశాఖ ఆలోచన చేస్తోంది. దీనికోసం ఇప్పటికే ఐసీఎంఆర్​కు దరఖాస్తు చేసినా ఇంకా అనుమతులు మంజూరు కాలేదు. అయితే కొవిడ్ నుంచి కోలుకున్న రోగులందరి దగ్గరి నుంచి ప్రస్తుతం వైద్యారోగ్యశాఖ ప్లాస్మాను సేకరిస్తోంది. మంగళగిరి ఎయిమ్స్​తో పాటు స్విమ్స్​లో ప్లాస్మా థెరపీ చికిత్స అందించేందుకు అనుమతుల కోసం అధికారులు దరఖాస్తు చేశారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలన్నీ ఈ తరహా చికిత్స కోసం ఐసీఎంఆర్​ను అనుమతులు కోరినప్పటికీ మరింత లోతుగా అధ్యయనం చేసిన తర్వాతే ప్లాస్మా థెరపీ గురించి ఆలోచన చేస్తామని స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో నిబంధనల మేరకు అధికారులు ప్లాస్మాను సేకరిస్తున్నారు.

పెరిగిన టెస్టుల సంఖ్య

మరోవైపు కరోనా నిర్ధారణ పరీక్షల్లోనూ ప్రభుత్వం వేగం పెంచింది. రోజుకు కనీస మొత్తంగా 7 వేల వరకూ టెస్టులు నిర్వహిస్తున్నట్టు వైద్యారోగ్యశాఖ చెబుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం పరీక్షలు చేయాల్సిన నమూనాలేవీ పెండింగ్​లో లేవని అధికారులు తెలిపారు. 234 కంటైన్మెంట్​ క్లస్టర్లలో అనుమానితులతో పాటు కరోనా నిరోధక కార్యకలాపాల్లో నిమగ్నమైన సిబ్బందికి ప్రత్యేకంగా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది.

వీఆర్డీఎల్​ ల్యాబ్స్​ ఏర్పాటుకు యత్నం

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ వీఆర్డీఎల్ ల్యాబ్స్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం పశ్చిమగోదావరి, విజయనగరం మినహా అన్ని జిల్లాల్లోనూ ఈ వైరాలజీ టెస్టింగ్ ల్యాబ్​లు పనిచేస్తున్నాయి. ఈ జిల్లాలకు సంబంధించి ప్రస్తుతం విజయవాడ, విశాఖల్లో ఉన్న హెచ్ఐవీ టెస్టింగ్ ల్యాబ్​లనే కరోనా టెస్టింగ్ ల్యాబ్​లుగా మార్చి వినియోగిస్తున్నారు. ఐసీఎంఆర్ నుంచి అనుమతి రావాల్సినప్పటికీ శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన వీఆర్డీఎల్ ల్యాబ్​ల నుంచి ట్రయల్ టెస్టులను ప్రారంభించారు. అటు నెల్లూరులోనూ మరో కొత్తల్యాబ్ ప్రారంభించేందుకు అనుమతి రావాల్సి ఉంది. అలాగే అనంతపురంలోని సీబీనాబ్ ప్రయోగశాలతో పాటు డీఆర్డీఓ, స్విమ్స్ సౌజన్యంతో మొబైల్ ల్యాబ్ తయారు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఆ జిల్లాల్లోనే కేసులు

ఇక రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులకు సంబంధించి రికవరీ రేటు గణనీయంగా పెరుగుతోందని.. రాగల రెండు మూడు రోజుల్లోనూ డిశ్చార్జి కేసులు పెరిగే అవకాశముందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ప్రస్తుతం కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లోనే 72 శాతం పాజిటివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. అయితే ఏపీలో కేసుల డబ్లింగ్ రేటు సమయం 13.8 రోజులుగా ఉందని సర్కారు తెలియచేసింది.

ఇదీ చూడండి ..

'రాష్ట్రంలో మూడు స్థాయిల్లో వ్యవసాయ సలహా మండళ్లు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.