సెక్యూరిటీల వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు వేల కోట్ల రూపాయల్ని రుణంగా తీసుకుంది. రిజర్వు బ్యాంకు ద్వారా సెక్యూరిటీ బాండ్లను వేలం వేసిన ప్రభుత్వం.. రెండు వేర్వేరు వడ్డీ రేట్లకు ఈ రుణాన్ని సేకరించింది. గరిష్టంగా 7.14 శాతం వడ్డీకి వెయ్యి కోట్ల రుణాన్ని.. అలాగే 7.13 శాతం వడ్డీకి మరో వెయ్యి కోట్లను అప్పుగా తీసుకుంది. ఇందులో వెయ్యి కోట్ల రూపాయలను 20 ఏళ్లలో చెల్లించే విధంగా, మరో వెయ్యి కోట్ల రూపాయల్ని 15 ఏళ్లలో చెల్లించే విధంగా ఏపీ సెక్యూరిటీలను వేలం వేసింది. కేంద్ర ప్రభుత్వం అదనంగా అనుమతించిన 10వేల 500 కోట్లలో.. ఇప్పటికే 8వేల కోట్ల రూపాయలను సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా ఏపీ ప్రభుత్వం సేకరించింది.
ఇదీ చదవండి: