విదేశాల నుంచి వచ్చిన వారి ఆరోగ్య పరిస్థితి, పూర్తి పర్యవేక్షణ కోసం ప్రభుత్వం ప్రతి 10 మందికీ ఒక అధికారిని నియమించింది. వారి ఆరోగ్య వివరాలపై రోజూ వివరాలను నమోదు చేసి వాటి ఆధారంగా వైద్య, ఆరోగ్యశాఖ చర్యలు తీసుకోనుంది. రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలపై విజయవాడలోని ఆరోగ్య విశ్వవిద్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. మండల స్థాయిలో కొద్ది మందిని కొవిడ్ - 19 ప్రత్యేక అధికారులుగా నియమించారు. ప్రస్తుత పరిస్థితి, తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేశారు.
24 గంటలూ పనిచేసేలా కాల్సెంటర్లు
కరోనా నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం 24 గంటలూ పనిచేసేలా కాల్ సెంటర్లను ఏర్పాటు చేసింది. జిల్లాకొకటి చొప్పున ఏర్పాటు చేయడం సహా రాష్ట్ర స్థాయిలో మరో కాల్ సెంటర్ను కేటాయించింది. ప్రజలకు అవసరమైన ఆరోగ్య సలహాలను ఇచ్చేందుకు వీటిని ఏర్పాటు చేసింది. రాష్ట్ర స్థాయి కాల్ సెంటర్ నెంబరు 0866 - 2410978 అని అధికారులు తెలిపారు.
జిల్లా | నెంబరు |
శ్రీకాకుళం | 6300073203 |
విజయనగరం | 08922-227950, 9494914971 |
విశాఖపట్నం | 9666556597 |
తూర్పుగోదావరి | 8841361763 |
పశ్చిమగోదావరి | 08812-222376 |
కృష్ణా | 9491058200 |
గుంటూరు | 0863-2271492 |
ప్రకాశం | 7729803162 |
నెల్లూరు | 9618232115 |
చిత్తూరు | 9849902379 |
కడప | 08562-245259 |
అనంతపురం | 08554-277434 |
కర్నూలు | 9441300005 |
ఇదీ చూడండి: