ETV Bharat / city

బీసీజీకి ఫీజు చెల్లింపుకు ప్రభుత్వ పాలనా అనుమతులు జారీ - బీసీజీకి ఏపీ ప్రభుత్వం ఫీజు

బీసీజీకి ఫీజు చెల్లింపుకు ప్రభుత్వం పాలనా అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన వ్యూహాలతో పాటు పాలనా వికేంద్రీకరణపై నివేదికల కోసం బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ను ప్రభుత్వం నియమించింది.

ap government administrative clearances for payment of fees to BCG
బీసీజీకి ఫీజు చెల్లింపుకు ప్రభుత్వ పాలనా అనుమతులు జారీ
author img

By

Published : Sep 28, 2020, 7:31 PM IST

బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఇచ్చిన నివేదికలకు ఫీజు చెల్లించేందుకు ప్రభుత్వం పాలనా అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బీసీజీకి 3 కోట్ల 51 లక్షల 5 వేల రూపాయల ఫీజును చెల్లించేందుకు ప్రణాళికా విభాగానికి అనుమతి మంజూరు చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ప్రణాళికా విభాగం కార్యదర్శి జీఎస్ఆర్కేఆర్ విజయ్​కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన వ్యూహాలతో పాటు పాలనా వికేంద్రీకరణపై నివేదికల కోసం బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ను ప్రభుత్వం నియమించింది. పాలనా వికేంద్రీకరణ, రాష్ట్రంలో అభివృద్ధి ప్రాజెక్టులపై మూడు విడతలుగా బీసీజీ నివేదిక ఇచ్చింది. బీసీజీకి ప్రోఫెషనల్ ఫీజు కింద గతంలోనే 7 కోట్ల 2 లక్షల 10 వేలను ఆర్ధికశాఖ మంజూరు చేసింది.

ఇదీ చదవండి: రైతులకు ఉచితంగా బోర్లు..ఖర్చంతా ప్రభుత్వానిదే: సీఎం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.