ETV Bharat / city

విద్యుత్ పొదుపుపై ఇంధనశాఖ చర్యలు..ప్రత్యేక విభాగాలు ఏర్పాటు

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, శాఖల్లో ఇంధన పొదుపు చర్యలకు ఇంధన శాఖ ఉపక్రమించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ శాఖల్లో ఇంధన పరిరక్షణా విభాగాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎనర్జీ కన్జర్వేషన్ సెల్​ను ఏర్పాటు చేయడం ద్వారా.. సమీప భవిష్యత్తుల్ పెరిగే డిమాండ్​తో పాటు ఇంధన వ్యయాన్ని అదుపులో ఉంచుకునేలా కార్యాచరణ చేపట్టనున్నారు. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అన్ని జిల్లాల కలెక్టర్లు, ప్రభుత్వ శాఖల విభాగాధిపతులకు ఆదేశాలు జారీ చేశారు.

plan for save more power for growth in
plan for save more power for growth in
author img

By

Published : Aug 11, 2020, 7:58 PM IST

ఆంధ్రప్రదేశ్​లో ఇంధన పొదుపు సాధించేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. పెరిగే విద్యుత్ డిమాండ్​తో పాటు ఇంధన వ్యయాన్ని అదుపులో ఉంచుకునేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం అన్ని ప్రభుత్వ శాఖలు, కార్యాలయాల్లో ఎనర్జీ కన్జర్వేషన్ సెల్​ను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అన్ని శాఖల విభాగాధిపతులు, జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు.

తొలిదశలో రాష్ట్ర, జిల్లా స్థాయి కార్యాలయాల్లో ఇంధన పరిరక్షణ విభాగాలు ఏర్పాటు కానున్నాయి. ఇంధన భద్రత సాధించేందుకు అంతర్జాతీయంగా అవలంబిస్తున్న విధానాలు అమలు చేయాలని నిర్ణయించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఇంధన పొదుపునకు అవసరమైన పరికరాలను కూడా వినియోగించాలని నిర్ణయించారు. ఈమేరకు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ, రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ కార్యాచరణ ప్రారంభించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 64 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోందని.... ఇంధన పరిరక్షణ చర్యలు చేపడితే 16 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్​ను ఆదా చేసే అవకాశముందని ఇంధన శాఖ అంచనా వేస్తోంది.

రాష్ట్రంలోని అన్ని హెచ్ఓడీ కార్యాలయాలు, రాష్ట్ర, జిల్లా స్థాయి కార్యాలయాలు, కార్పొరేషన్లు, సొసైటీలు తదితర కార్యాలయాల్లో ఈ ఇంధన పరిరక్షణ విభాగాలు ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. మరో వైపు విద్యుత్​ను సమర్థంగా వినియోగించుకునేలా నూతన సాంకేతికతను రాష్ట్రంలోకి తెచ్చేందుకు ప్రముఖ అంతర్జాతీయ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పారిశ్రామిక, వ్యవసాయ, పట్టణాభివృద్ధి లాంటి కీలక రంగాల్లో ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తేవటం ద్వారా ఇంధన భద్రత, ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రభుత్వం యోచిస్తోంది.

ఇదీ చదవండి

ఆస్తిపై కుమార్తెకూ సమాన హక్కు: సుప్రీం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.