ETV Bharat / city

పట్టణ భవన నిర్మాణాల నిబంధనలకు సవరణలు - latest news of ap town planning

పట్టణ భవన నిర్మాణాలకు సంబంధించిన నిబంధనల్లో సవరణలు చేస్తూ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బహుళ అంతస్తులకు సీఎల్ఐఐఎఫ్ ను 50 శాతం తగ్గించాలని నిర్ణయించింది. భవన నిర్మాణ రుసుములకు టీడీఆర్ బాండ్ల వినియోగం రద్దు చేసింది. పట్టణ భవన నిర్మాణ నిబంధనల్లో సడలింపులు ఇచ్చారు.

ap-governament-new-orders-on-town-planning
పట్టణ భవన నిర్మాణాల నిబంధనలకు సవరణలు
author img

By

Published : Oct 2, 2020, 5:15 PM IST

Updated : Oct 2, 2020, 6:20 PM IST

రాష్ట్రంలో బహుళ అంతస్తుల నిర్మాణాలపై వసూలు చేస్తోన్న పట్టణ స్థాయి మౌలిక సదుపాయాల ,ప్రభావ రుసుములు ఇప్పటి వరకు వసూలు చేస్తోన్న దానికంటే 50 శాతానికి తగ్గించారు. వీటిని కూడా 3 ఏళ్లలో ఆరు విడతలుగా చెల్లించే వెసులుబాటు నిర్మాణదారులకు కల్పించారు. పట్టణ ప్రణాళిక విభాగ ఉన్నతాధికారుల బృందం ఇచ్చిన నివేదికను ఆమోదిస్తూ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి భవన నిర్మాణంలో 5 శాతం ప్రాంతాన్ని నగర పాలక, పురపాలక సంఘాలకు తనఖా చేయాల్సి ఉంది.

భవన నిర్మాణాలకు ఆన్​లైన్​లో ఇస్తున్న అనుమతులకు సంబంధించి ముందస్తు పరిశీలన ప్రక్రియను ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే దానికి దరఖాస్తుదారులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. అనధికార నిర్మాణాల పర్యవేక్షణ , నియంత్రణ బాధ్యతలను... వార్డు సచివాలయ ప్రణాళిక కార్యదర్శికి అప్పగించారు. బదిలీకి వీలున్న హక్కు పత్రాలను భవన నిర్మాణ రుసుముల కోసం వినియోగించుకునే అవకాశాన్ని రద్దు చేశారు. కేవలం వీటిని భవనాలపై అదనపు అంతస్తులు నిర్మించుకోవడానికి మాత్రమే వినియోగించుకోవాలి. టీడీఆర్ బాండ్లు జారీ, వినియోగం, తదితర అంశాలపైన నిరంతర పర్యవేక్షణ కోసం ఆన్ లైన్ పోర్టల్ ను మరింత సమర్థవంతంగా వినియోగించనున్నారు.

ప్రత్యేక వ్యవస్థ...

అనధికార లేఅవుట్లు , భవన నిర్మాణాల నియంత్రణ కోసం భౌగోళిక సమాచార వ్యవస్థ , మొబైల్ అప్లికేషన్​ తీసుకురానున్నారు. లేఅవుట్ల అనుమతిలోనూ అత్యంత పారదర్శకంగా వ్యవహరించేలా ప్రత్యేక వ్యవస్థ ప్రవేశపెడుతున్నారు. అనుమతి లేని ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేసే వీలు లేకుండా చేయనున్నారు. ఇందుకోసం పట్టణ ప్రణాళిక విభాగంలో వార్డు సచివాలయ ప్రణాళిక కార్యదర్శులను పూర్తి స్థాయిలో భాగస్వామ్యులు చేస్తారు. అనుమతుల నుంచి పర్యవేక్షణ వరకు వీరికి కొన్నిబాధ్యతలు అప్పగించారు. భవన నిర్మాణ అనుమతుల సమయంలోనే ఖాళీ స్థలానికి పన్ను ఆన్ లైన్​లో చెల్లించే విధంగా ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు భవన నిర్మాణాలకు వేరుగా అనుమతి తీసుకుని వీఎల్​టీని మరోసారి చెల్లించడంలో జరిగే జాప్యాన్ని నివారించనున్నారు.

పారిశ్రామిక అనుమతుల విషయంలో మొత్తం నిర్మాణ ప్రాంతంలో 10 శాతం ఖాళీ స్థలాన్ని... పుర, నగర పాలక సంస్థలకు రిజిస్ట్రేషన్ చేసే విషయంలో సవరణలు ఇచ్చారు. వీటిని సామాజిక అవసరాల కోసమే వినియోగిస్తామని ఒప్పంద పత్రం ఇస్తే సరిపోతుంది. ఇప్పటివరకు 4 వేల చదరపు మీటర్ల నిర్మాణ స్థలానికి రహదారి ఉండాలన్న నిబంధన ఎత్తేశారు. ఇకపై 10 వేల చదరపు మీటర్ల విస్తీర్ణం కల్గిన పరిశ్రమలకే వెనుక నుంచి రహదారి సదుపాయం కల్పించాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి

అదనపు రుణం తీసుకునేందుకు రాష్ట్రానికి కేంద్రం అనుమతి

Last Updated : Oct 2, 2020, 6:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.