ETV Bharat / city

బహిరంగ మార్కెట్ నుంచి అప్పుల్లోనూ మూడో స్థానం

దేశంలో చేబదుళ్ల రూపంలో అత్యధికంగా అప్పులు తీసుకున్న మొదటి ఆరు రాష్ట్రాల జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాలు నిలిచాయి. ఆర్‌బీఐ గురువారం విడుదల చేసిన డిసెంబరు నెలవారీ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్, జమ్మూ కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, కేరళ, నాగాలాండ్, తెలంగాణ రాష్ట్రాల వేస్‌ అండ్‌ మీన్స్‌ వినియోగం పెరిగింది.

rbi monthly statistics
rbi monthly statistics
author img

By

Published : Dec 25, 2020, 3:54 AM IST

దేశంలో చేబదుళ్ల రూపంలో అత్యధికంగా అప్పులు తీసుకున్న మొదటి ఆరు రాష్ట్రాల జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాలు నిలిచాయి. ఆర్‌బీఐ గురువారం విడుదల చేసిన డిసెంబరు నెలవారీ నివేదిక ప్రకారం... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌ నుంచి 37వేల 250 కోట్ల రుణం సేకరించి మూడో స్థానంలో నిలిచింది.

అటు తెలంగాణ ప్రభుత్వం‌ 25వేల 9వందల 61 కోట్ల రుణాన్ని పొంది ఆరో స్థానంలో నిలిచింది. ఏపీ గతేడాది 12 నెలల్లో తీసుకున్న రుణంలో 87.88 శాతం మొత్తాన్ని.. ఈసారి తొలి ఏడు నెలల్లోనే తీసుకొంది. దీని ప్రకారం ప్రతినెలా సగటున 5వేల 321 కోట్లు అప్పు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. జమ్మూకశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, కేరళ, నాగాలాండ్‌, తెలంగాణ రాష్ట్రాలు మెుదటి ఆరు స్థానాల్లో ఉన్నాయి. కరోనా కారణంగా ఆదాయం తగ్గడంతో ప్రభుత్వాలు అప్పులపై ఆధారపడినట్లు ఆర్‌బీఐ తాజా నివేదిక స్పష్టం చేసింది.

2019-20తో పోలిస్తే 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఉత్తర్‌ప్రదేశ్‌ మినహా.... అన్ని రాష్ట్రాల రుణభారం భారీ స్థాయిలో పెరిగింది. అయితే మణిపూర్‌, పంజాబ్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలు మాత్రం చేబదుళ్లను తగ్గించుకున్నాయి.

ఇదీ చదవండి

అధికారుల నిర్వాకం..రుణమివ్వలేదని బ్యాంకుల ముందు 'చెత్త' !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.