రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ వల్ల పదోతరగతి పరీక్షపత్రాలు తగ్గిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 11 ప్రశ్నపత్రాలను 6కు తగ్గించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ చర్యలు విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకు ఉపకరిస్తాయని వెల్లడించింది. 6 పేపర్ల విధానం వల్ల 360 ప్రశ్నలు 197 తగ్గుతాయని అధికారులు తెలిపారు. అయితే పేపర్ల తగ్గింపు ఈ విద్యా సంవత్సరానికే పరిమితమని విద్యాశాఖ స్పష్టం చేసింది.
ఈ ఆరు ప్రశ్నపత్రాలు వందేసి మార్కులకు ఉంటాయని విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. కరోనా వల్ల మార్చి 19 నుంచి అన్ని పాఠశాలలు మూసివేసినట్లు తెలిపింది. పూర్తి జాగ్రత్తలు తీసుకుని జులై 10 నుంచి పది పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే తెలంగాణలో పది పరీక్షలు రద్దు చేసి ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వనున్నారు.
ఇదీ చూడండి..