కోర్టు ధిక్కరణ కేసులో రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, హోం శాఖ సెక్రటరీ ఐజీ మహేశ్‌చంద్ర లడ్డా నేడు హైకోర్టులో హాజరు కానున్నారు. ఎస్సై యు.రామారావు దాఖలు చేసిన పిటిషన్పై ఈ నెల 25న విచారణ జరిపిన న్యాయస్థానం... డీజీపీ గౌతమ్ సవాంగ్, ఐజీ మహేశ్ చంద్ర గైర్హాజరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
హాజరు కాలేకపోవడానికి డీజీపీ, ఐజీ పేర్కొన్న కారణాలు సంతృప్తికరంగా లేనప్పటికీ, వారి పోస్టులను పరిగణనలోకి తీసుకుని సోమవారం (జనవరి 25) నాటి విచారణకు హాజరు నుంచి మినహాయిస్తున్నట్లు పేర్కొన్నారు. తదుపరి విచారణ నేటికి వాయిదా వేసిన మేరకు.. ఇవాళ వాదనలు జరగనున్నాయి. కచ్చితంగా హాజరు కావాల్సిందే అని కోర్టు ఆదేశించిన మేరకు.. వీరు ముగ్గురూ నేడు న్యాయస్థానం ఎదుట హాజరుకానున్నారు.
సంబంధిత కథనం: