రాష్ట్రంలో నిబంధనలు ఉల్లంఘించే మద్యం కొనుగోలుదారులపై కఠినంగా వ్యవరిస్తామని డీజీపీ గౌతమ్‌సవాంగ్ హెచ్చరించారు. నిర్ణీత సమయంలోనే దుకాణాల వద్ద విక్రయాలు జరపాలన్న ఆయన.. మద్యం కొనుగోలుదారులు భౌతిక దూరం పాటించాలన్నారు. మద్యం దుకాణాల వద్ద గుమికూడకుండా ఉండాలని సూచించారు.
ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని డీజీపీ చెప్పారు. ఆదేశాలు పాటించని దుకాణాలను తక్షణమే మూసేస్తామని స్పష్టం చేశారు. ప్రశాంత వాతావరణానికి భంగం కల్పిస్తే... జాతీయ విపత్తు చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వివాదాలు సృష్టించే వారిపై అనునిత్యం ప్రత్యేక నిఘా ఉంటుందని సవాంగ్ చెప్పారు.
ఇదీ చూడండి..