ETV Bharat / city

రాష్ట్రంలో 26 మంది డిప్యూటీ కలెక్టర్లు బదిలీ

author img

By

Published : Oct 17, 2020, 9:59 PM IST

రాష్ట్రంలో 26 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు ఇచ్చారు. తక్షణమే ఆదేశాలు అమల్లోకి వస్తాయని ప్రకటించారు.

డిప్యూటీ కలెక్టర్లు
డిప్యూటీ కలెక్టర్లు

రాష్ట్ర వ్యాప్తంగా 26 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణం ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొంటూ... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశాలు ఇచ్చారు. డిప్యూటీ కలెక్టర్ల బదిలీలతో పాటు వెయిటింగ్​లో ఉన్నవారికి కూడా పోస్టింగ్​లు ఇస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.

సీసీఎల్​ఏలో సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్న జె. శివశ్రీనివాసును నెల్లూరు జిల్లా ఆసరా, సంక్షేమ శాఖల జేసీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సచివాలయంలో ఎన్నికల విభాగంలో పనిచేస్తున్న వి.సరళను పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్​గా బదిలీ చేశారు. దేవాదాయశాఖలో డిప్యూటీ కలెక్టర్​గా ఉన్న కిరణ్ కుమార్​కు పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల ఈవోగా నియమిస్తూ స్థానచలనం కల్పించారు.

రైతు బజార్ల సీఈవోగా బి. శ్రీనివాసరావుకు పోస్టింగ్ ఇచ్చారు. డి.పెద్దిరాజును శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయ ఈవోగా నియమించారు. డి.వెంకటేశ్వరరావును మాన్సాస్ ట్రస్టు ఈవోగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

ఇదీ చదవండి:

సీఎం జగన్​ను 2 లక్షల ఓట్ల తేడాతో ఓడిస్తా: ఎంపీ రఘురామ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.