కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎవరూ.. ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేయవద్దని రాష్ట్ర కొవిడ్ కమాండ్ కంట్రోల్ ఛైర్మన్ కేఎస్ జవహర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎన్ 440 కే వైరస్‌పై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ స్పష్టత ఇచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో ఈ వైరస్ తీవ్రంగా ఉన్నట్టు ఎలాంటి నిర్థరణ జరగలేదని స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన పరిశోధన డేటా కూడా ఏమీలేదని జవహర్‌రెడ్డి వెల్లడించారు.
ప్రతీ నెలా సీపీఎంబీకి 250 నమూనాలు పంపుతామన్నారు. ఎన్ 440కె (బి.1.36) వైరస్ దక్షిణ భారత దేశం నుంచి వెళ్లిన నమూనాల్లో గుర్తించారని వెల్లడించారు. ఆ వైరస్ ప్రభావం గతేడాది డిసెంబర్, ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో కనిపించిందని.. ఇప్పుడు ఆ ప్రభావం చాలా స్వల్పమని పేర్కొన్నారు. ప్రస్తుతం బి1.167, బి.1 వైరస్ స్ట్రెయిన్‌ల ప్రభావం దక్షిణ భారతంపై ఎక్కువగా ఉందని చెప్పారు.
ఇదీ చదవండి:
కొవిడ్ వైద్య చికిత్సలపై హైకోర్టులో విచారణ.. సర్కార్ తీరుపై అసంతృప్తి!