రాష్ట్రంలో కొత్తగా 1,393 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌తో మరో 8 మంది చనిపోయారు. కొవిడ్‌తో చిత్తూరులో ముగ్గురు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లాలో ఒక్కరు మరణించారు. కరోనా నుంచి 1,296 మంది కోలుకున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 14797 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 60,350 మందికి కరోనా పరీక్షలు చేశారు.
ఇదీ చదవండి: Corona update: దేశంలో మరో 34,403 కరోనా కేసులు