రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల అమలులో బ్యాంకర్లకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు బ్యాంకుల ప్రతినిధులతో చర్చించారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా వివిధ జాతీయ బ్యాంకుల ప్రతినిధులతో మాట్లాడిన సీఎంఓ కార్యాలయ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్... ప్రత్యేకించి మహిళలకు అందిస్తున్న పథకాలు, వైఎస్ఆర్ చేయూత, ఆసరా పథకాలకు సంబంధించిన అంశాలపై బ్యాంకర్లతో మాట్లాడారు.
వైఎస్ఆర్ చేయూత, ఆసరా పథకాలు మహిళల ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చాయని బ్యాంకర్లు అభిప్రాయపడినట్టు సీఎంఓ కార్యాలయం స్పష్టం చేసింది. ఆర్థిక స్వావలంబన కల్పించటంలో తోడ్పాటు అందిస్తున్నాయని వివిధ బ్యాంకుల ప్రతినిధులు అభిప్రాయపడినట్లు సీఎంఓ కార్యాలయం తెలిపింది. మరోవైపు మహిళల ఆర్ధిక స్వావలంబన కోసం అమూల్, హెచ్యూఎల్, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నట్టు సీఎంఓ కార్యాలయ అధికారులు బ్యాంకర్లకు వివరించారు.
ఇదీ చదవండి
సుప్రీంకు వెళ్లినా.. ప్రభుత్వానికి నిరాశ తప్పదు: రఘురామకృష్ణరాజు