ETV Bharat / city

రైతులు లబ్ధి పొందేలా చర్యలు తీసుకోండి: సీఎం జగన్ - సీఎం జగన్

వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్‌, మార్కెటింగ్‌, సాంకేతికతపై దృష్టి పెట్టేందుకు నెదర్లాండ్‌ ప్రభుత్వం సహా వివిధ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. రైతులు తరచుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న దాదాపు 8 ప్రధాన పంట ఉత్పత్తులు ప్రాసెసింగ్‌ చేసేలా ఒప్పందాలపై సంతకం చేసింది. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా, ఆక్వా రంగ రైతులూ లబ్ధి పొందేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు.

ap-cm-ys-jagan
ap-cm-ys-jagan
author img

By

Published : Sep 5, 2020, 3:59 AM IST

రాష్ట్రంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌పై సీఎం జగన్‌ సమీక్షించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో... వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు, వ్యవసాయ మిషన్‌ ఉపాధ్యక్షుడు నాగిరెడ్డి సహా వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. వ్యవసాయం, వాణిజ్యం, సాంకేతికతపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. అరటి, టమోట, మామిడి, చీనీ, మిర్చి, కూరగాయలు సహా పలు వ్యవసాయ, ఆక్వా ఉత్పత్తుల ఫుడ్‌ ప్రాసెసింగ్‌పై పలు సంస్థలతో 8 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

వివిధ సంస్థలతో ఒప్పందాలు

అరటి కోసం ఎన్​ఆర్​సీ బనానా తిరుచ్చితో ఒప్పందం చేసుకోగా... మైక్రోఫుడ్‌ ప్రాసెసింగ్‌ ప్రచారంతోపాటు నాణ్యత పరీక్షల ల్యాబ్‌పై ఆ సంస్థ పని చేయనుంది. అరటిలో తేమ తొలగించే విధానాన్ని బనానా తిరుచ్చి సంస్థ ప్రతినిధులు... సీఎంకు వివరించారు. అరటి సహా పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్‌ కోసం పుణెకు చెందిన ఫ్యూచర్‌టెక్‌ ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో ఒప్పందం కుదిరింది. టమోటా, అరటి ప్రాసెసింగ్‌కు మౌలిక సదుపాయలు కల్పించే బాధ్యతను బిగ్‌ బాస్కెట్‌కు ప్రభుత్వం అప్పగించింది. మామిడి, చీనీ, మిరప ప్రాసెసింగ్‌ కోసం ఐటీసీతో, ఉల్లి ప్రాసెసింగ్‌కు లారెన్స్‌ డేల్‌ ఆగ్రో ప్రాసెసింగ్‌ కంపెనీతోనూ ఒప్పందం చేసుకుంది. ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో అత్యంత కీలకమైన ఇంటీరియర్‌ ఆర్కిటెక్చర్, డిజైన్, ప్యాకేజింగ్, కంటైనర్ల అంశాలపై నెదర్లాండ్స్‌ ప్రభుత్వంతో ఒప్పందంపై సంతకాలు చేసింది. రొయ్యలు, చేపల పెంపకంలో సాంకేతిక, మార్కెటింగ్‌ తదితర అంశాలను ఐఎఫ్​బీ సంస్థకు అప్పగించింది. ఆక్వా ఉత్పత్తుల ఎగుమతి, రిటైల్‌ మార్కెటింగ్‌ కోసం అంపైర్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.

ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో మహిళా గ్రూపులను ప్రోత్సహించేటప్పుడు వారి ఉత్పత్తులకు మార్కెటింగ్‌ ఇబ్బంది లేకుండా ఉండేందుకు పెద్దపెద్ద సంస్థలతో అనుసంధానం ముఖ్యమని సీఎం జగన్‌ అభిప్రాయపడ్డారు. ఈ రంగంలో నైపుణ్యాభివృద్ధి కోసం త్వరలో ఏర్పాటు చేయనున్న కళాశాలల్లో ప్రత్యేక కోర్సులు నిర్వహించాలని నిర్దేశించారు. జిల్లాల్లో నెలకొల్పుతున్న అనుసంధానిత ప్రయోగశాలల్లో అంతర్భాగంగా ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ల ఏర్పాటు చేయాలని సూచించారు.

ఇదీ చదవండి

ఎమ్మెల్యే వంశీ అనుచరులు, వైకాపా నేతల మధ్య ఘర్షణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.