ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిల్లీ పర్యటన వాయిదా పడింది. పర్యటనకు సిద్ధమైనప్పటికీ అనివార్య కారణాల వల్ల ఆఖరి నిమిషంలో సీఎం తన పర్యటనను వాయిదా వేసుకున్నారు.
వాస్తవానికి ఈరోజు మధ్నాహ్నం ఒంటి గంటకు దిల్లీ చేరుకుని 3 గంటలకు జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌తో, సాయంత్రం 4.45కి గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీతో భేటీ కావాల్సి ఉంది. రాత్రి 10 గంటలకు అమిత్ షాతో భేటీ అయ్యేందుకు సిద్ధమయ్యారు. కరోనా లాక్‌డౌన్ సడలింపుల పరిణామాలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బిజీగా ఉండటంతో సీఎం పర్యటన వాయిదా పడినట్టు సమాచారం.