ముఖ్యమంత్రి జగన్ నేడు దిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటల 10 నిమిషాలకు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఉదయం మంత్రివర్గ సమావేశం ముగిసిన వెంటనే... గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సీఎం దిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దుతో పాటు మండలి వ్యవహారాలను ప్రధానికి వివరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శాసన మండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని పార్లమెంటులో ఆమోదించేలా చూడమని కోరే అవకాశమున్నట్లు సమాచారం. పాలనాపరమైన వ్యవహారాలను విశాఖకు, హైకోర్టును కర్నూలుకు తరలించే అంశాలపై... ప్రధానితో లోతుగా చర్చించవచ్చని తెలుస్తోంది. ఈ విషయంలో ఏపీ పునర్విభజన చట్టంలో సవరణ అవసరాన్ని ప్రధాని మోదీతో చర్చించే అవకాశముంది. పోలవరం ప్రాజెక్టుకు నిధుల మంజూరు విషయంతో పాటు రెవెన్యూ లోటు భర్తీ, బడ్జెట్ కేటాయింపుల్లో ఏపీకి ఎక్కువ నిధులు ఇవ్వాల్సిందిగా సీఎం కోరే అవకాశం ఉంది.
హస్తినకు నేడు సీఎం జగన్...ప్రధానితో సమావేశం - ap cm jagan will meet prime minister modi in delhi
సీఎం జగన్ హస్తిన పర్యటన ఖరారైంది. ఇవాళ మంత్రివర్గ సమావేశం అనంతరం విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం ప్రధాని మోదీని కలిసి రాష్ట్రంలోని పలు అంశాలను వివరించే అవకాశం ఉంది.