ETV Bharat / city

అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటివారినైనా విడిచిపెట్టొదు: సీఎం

author img

By

Published : Sep 8, 2020, 9:17 PM IST

మంత్రులు, ఎమ్మెల్యేలు సహా ఎవరు అక్రమ రవాణాకు పాల్పడినా సరే, విడిచి పెట్టవద్దని కలెక్టర్లు, ఎస్పీలను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. మద్యం, ఇసుక విషయంలో కఠినంగా వ్యవహరించాలని...ఆ విషయంలో తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. వాటిపై రాజకీయంగా కూడా ఎటువంటి ఒత్తిళ్లు రావని స్పష్టం చేశారు.

cm jagan
cm jagan

మద్యం, ఇసుక అక్రమ రవాణాకు ఎవరు పాల్పడినా ఏ మాత్రం ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సహా ఎవరు అక్రమ రవాణాకు పాల్పడినా సరే విడిచి పెట్టవద్దని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. మద్యం, ఇసుక అక్రమ రవాణాకు ప్రయత్నిస్తే ఎంతటి వారిపైనైనా సరే కఠినంగా వ్యవహరించాలని... దీనిపై మీకు తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు. వాటిపై రాజకీయంగా ఎటువంటి ఒత్తిళ్లు రావని ముఖ్యమంత్రి పూర్తి భరోసా ఇచ్చారు.

మద్యం, అక్రమ రవాణా చేయవద్దని, చేసే వారిని ఉపేక్షించవద్దని మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. మద్యం, ఇసుకపై నిరంతరం పర్యవేక్షణ జరుగుతోందన్న ముఖ్యమంత్రి.. వాటిపై జిల్లా ఎస్పీలు, ఎస్‌ఈబీ సిబ్బంది ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారని ప్రశంసించారు. మద్యం ధరలను తగ్గించడం వల్ల స్మగ్లింగ్‌ జరగకుండా చర్యలు తీసుకున్నప్పటికీ, ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని అన్నారు. కొన్ని సున్నిత అంశాల మీద, ముఖ్యంగా అట్టడుగు వర్గాల కేసులకు సంబంధించి, పోలీసులు అనుసరించిన విధానం, వ్యవహరించిన తీరు బాగుందని సీఎం వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పలు జిల్లాల ఎస్పీలను ముఖ్యమంత్రి అభినందించారు.

ఇదీ చదవండి

రియా అరెస్ట్.. బాలీవుడ్​ ప్రముఖుల్లో గుబులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.