ఆలయాల ఆస్తుల పరిరక్షణ, హిందూ ధర్మ పరిరక్షణపై రాష్ట్రవ్యాప్తంగా భాజపా ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి. గుంటూరులోని తన నివాసం వద్ద భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దీక్షలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సాయంత్రం 5 గంటల వరకు భాజపా శ్రేణులు దీక్షలో పాల్గొననున్నాయి.
దిల్లీలో జీవీఎల్ దీక్ష
రాష్ట్ర భాజపా ఇచ్చిన పిలుపు మేరకు దిల్లీలోని తన నివాసంలో ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ ఒకరోజు నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఆయనతో పాటు భాజపా రాష్ట్ర ఇన్‌ఛార్జ్ సునీల్ దియోదర్, కిలారు దిలీప్‌కుమార్ కూడా పాల్గొన్నారు.
ఇదీ చదవండి: