వినాయక చవితి వేడుకల నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఇళ్లల్లోనే వినాయక చవితి వేడకలు నిర్వహించుకోవాలని పేర్కొనడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. రాష్ట్రవ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి వేడుకలు బహిరంగ ప్రదేశాల్లోనే జరిగిన విషయాన్ని ప్రభుత్వం ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించింది.
కరోనా పేరుతో వినాయక చవితిని వ్యక్తిగతంగా ఇళ్ల వద్దే చేసుకోవాలంటూ.. బహిరంగ ప్రదేశాల్లో జరపకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సమీక్షా సమావేశంలో నిర్ణయించడం ద్వారా ఎక్కువమంది ప్రజల మనోభావాలను దెబ్బతీయడమే అవుతుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. నిబంధనలు పాటిస్తూ.. అన్ని వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు, సినిమాహాళ్లు పనిచేస్తున్న సంగతిని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే కరోనా అదుపులో ఉందని చెబుతూ... కేవలం వినాయక చవితి వేడుకలకు కరోనా అడ్డంకిగా ఆంక్షలు విధించడం ఏమిటని సోము వీర్రాజు ప్రశ్నించారు. వినాయక చవితి వేడుకలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: