ETV Bharat / city

పెండింగ్​ అంశాలన్నీ ఏపీ-తెలంగాణ రాష్ట్రాలు ఉమ్మడిగా పరిష్కరించుకోవాలి: అమిత్​ షా - AP BIFURCATION IN SZC MEETING IN KERALA

AP BIFURCATION IN SZC MEETING IN KERALA : ఆంధ్రప్రదేశ్-తెలంగాణా రాష్ట్రాలు ఉమ్మడిగా విభజనకు సంబంధించిన అంశాలను పరిష్కరించుకోవాల్సి ఉందని కేంద్ర హోం మంత్రిత్వశాఖ నేతృత్వంలో జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం అభిప్రాయపడింది. రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్​లో ఉన్న అంశాలు పరస్పరం చర్చించుకుని పరిష్కరించుకోవాలని హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. కేరళలోని తిరువనంతపురంలో జరిగిన 30 సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ విభజన అంశాలతో కలిపి మొత్తం 26 అజెండా అంశాలపై చర్చ చోటు చేసుకుంది.

AP BIFURCATION IN SZC MEETING IN KERALA
AP BIFURCATION IN SZC MEETING IN KERALA
author img

By

Published : Sep 3, 2022, 10:52 PM IST

SZC MEETING : కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ విభజన అంశాలే కీలకంగా నిలిచాయి. చర్చించిన 26 అంశాల్లో 9 ఏపీకి చెందిన విభజన హామీలపైనే చర్చ జరిగింది. సుదీర్ఘకాలంగా పెండింగ్​లో ఉన్న విభజన అంశాలపై ఏపీ తెలంగాణా రాష్ట్రాలు ఉమ్మడిగా పరిష్కరించుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అభిప్రాయం వ్యక్తం చేశారు. కేరళలోని తిరువనంతపురంలో జరిగిన 30వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగింది.

ఏపీ, తెలంగాణాకు చెందిన వివిధ అంశాలపై చర్చించారు. సదరన్ జోనల్ కౌన్సిల్ అజెండాలో భాగంగా 26 అంశాలను ప్రతిపాదిస్తే అందులో 9 ఏపీ పునర్విభజన అంశాలే ఉన్నట్టు కేంద్ర హోం మంత్రిత్వశాఖ వెల్లడించింది. రెండు తెలుగు రాష్ట్రాలూ పరస్పరం పరిష్కరించుకోవాల్సిన అంశాలను త్వరగా తేల్చుకోవాలని కేంద్ర మంత్రి సూచించారు. వ్యూహాత్మకంగా, వాణిజ్య పరంగా తీరప్రాంతాలు కలిగి ఉన్న రాష్ట్రాలు భారత్ కు ఎంతో ముఖ్యమని వీటిని కలుపుతూ ప్రత్యేక రవాణామార్గాలను కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టు అమిత్‌షా వెల్లడించారు. మొత్తం 108 ప్రాజెక్టులకు గానూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ రూ.76 వేల కోట్లను వ్యయం చేసిందని తెలిపారు.

సాగర తీరప్రాంత రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద 7,737 కోట్లను వ్యయం చేస్తున్నట్టు కేంద్ర మంత్రి వివరించారు. తీరప్రాంత రాష్ట్రాల వద్ద నార్కోటిక్స్ స్మగ్లింగ్ లాంటి అక్రమాలు జరుగుతున్నాయని వీటిపై కేంద్ర రాష్ట్రాలు ఉమ్మడిగా నిఘా వేయాల్సిన అవసరముందని అమిత్ షా సూచించారు. ఇప్పటికే 12 లక్షల మంది మత్స్యకారులకు క్యూఆర్ కోడ్ తో కూడిన ఆధార్ గుర్తింపు కార్డులు జారీ చేశామని కేంద్ర మంత్రి తెలిపారు.

ఇవీ చదవండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.