ETV Bharat / city

ap assembly: ఆ ఒక్క రోజే అసెంబ్లీ సమావేశాలు.. ఎందుకంటే? - ఏపీ అసెంబ్లీ తాజా వార్తలు

అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 18న ఒక్క రోజు మాత్రమే నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. తిరిగి వచ్చే నెలలో వారం లేదా పదిరోజుల పాటు నిర్వహించే అవకాశం ఉంది.

ap assembly
ap assembly
author img

By

Published : Nov 13, 2021, 12:42 PM IST

Updated : Nov 13, 2021, 1:44 PM IST

అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 18న ఒక్క రోజు నిర్వహించనున్నారు. వచ్చే నెలలో వారం లేదా పదిరోజులపాటు నిర్వహించే అవకాశం ఉంది. నిబంధనల ప్రకారం ప్రతీ ఆర్నెల్లకు ఒకసారి సమావేశం కావాల్సి ఉంది. గత సమావేశాలు జరిగి ఈ నెల 19కి ఆరు నెలలు పూర్తవుతోంది. ఆరు నెలల్లోపు సభను సమావేశ పరచాల్సి ఉన్నందున.. ఒక్క రోజు నిర్వహించాలని నిర్ణయించారు.

ఇక, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిస్తే.. అసెంబ్లీ సమావేశాలను డిసెంబరు మొదటి వారంలో, అలా కాకుండా పోలింగ్‌ జరిగితే వచ్చే నెల నాలుగో వారంలో పూర్తి స్థాయిలో నిర్వహిస్తారు. ఈ సమావేశాల్లోనే శాసనమండలి ఛైర్మన్‌, డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నికనూ నిర్వహించనున్నారు.

ఇదీ చదవండి:

ఆంధ్రాపై తెలంగాణ సర్కారు వ్యాఖ్యలు.. ఎవ్వరికీ మంచివి కావు : మంత్రి వెల్లంపల్లి

Last Updated : Nov 13, 2021, 1:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.