ETV Bharat / city

Southern Zonal Council Meeting: ఏపీ కీలక ప్రతిపాదన.. వెల్లడించిన కేంద్రం - సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం

కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో తిరుపతిలో జరగనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో.. ఏపీ నుంచి ఓ కీలకమైన ప్రతిపాదన వచ్చినట్టు కేంద్రం పేర్కొంది. ఏపీ నుంచి వచ్చిన 26 ప్రతిపాదనల్లో రాష్ట్రంలో మూడు రాజధానుల సమగ్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఉదారంగా నిధులివ్వాలని ఉన్నట్టు స్పష్టం చేసింది.

ap-asked-the-central-government-to-fund-the-three-capitals
'మూడు రాజధానులకు నిధులివ్వండి'
author img

By

Published : Nov 12, 2021, 6:43 AM IST

కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అధ్యక్షతన ఆదివారం తిరుపతిలో జరగనున్న దక్షిణాది ప్రాంతీయ మండలి 29వ సమావేశంలో 26 అంశాలపై చర్చించనున్నారు. మొదట 23 అంశాలతో సమావేశం ఎజెండాకు స్టాండింగ్‌ కమిటీ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపాదించిన మూడు అంశాల్ని స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌ అనుమతితో ఎజెండాలో చేర్చారు. 24 అంశాల్ని ఇప్పుడు కొత్తగా చర్చకు చేపట్టనున్నారు. వాటిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన అంశాలే ఏడున్నాయి.

రాష్ట్రంలో మూడు రాజధానుల సమగ్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఉదారంగా నిధులివ్వాలని దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. ఏపీకి కొత్త రాజధాని అభివృద్ధి కోసం రూ.2,500 కోట్ల సాయాన్ని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం 2014-17 మధ్య రూ.1,500 కోట్లు విడుదల చేసిందని, మిగతా రూ.వెయ్యి కోట్లను విడుదల చేయాలని విజ్ఞప్తి చేయనుంది. స్టాండింగ్‌ కమిటీ రూపొందించిన సమావేశంలో ఎజెండాలో మాత్రం.. మూడు రాజధానుల అంశం కోర్టు పరిధిలో ఉందని కేంద్ర హోం శాఖ చెప్పినట్టుగా పేర్కొన్నారు. కొత్త రాజధాని నిర్మాణానికయ్యే మొత్తం ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరించేలా చట్టాన్ని సవరించాలని అక్టోబరు 20న రాష్ట్ర ప్రభుత్వం కోరినట్టుగా తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలివీ..

  • ఏపీ ప్రాదేశిక జలాల్లోకి తమిళనాడుకు చెందిన ఫిషింగ్‌బోట్లు అక్రమంగా ప్రవేశించడం వల్ల స్థానిక మత్స్యకారులతో ఘర్షణలు జరుగుతున్నాయి.
  • చిత్తూరు జిల్లాలోని కుప్పంలో పాలార్‌ నదిపై చిన్ననీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణంపై తమిళనాడు అభ్యంతరం చెప్పడంపై చర్చ.
  • తెలుగుగంగ ప్రాజెక్టు నుంచి చెన్నైకి తాగునీటి సరఫరా చేసినందుకు తమిళనాడు ఇంకా రూ.338 కోట్ల చెల్లించాల్సి ఉండటం.
  • ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ విద్యుత్‌ సంస్థలు చెల్లించాల్సిన రూ.6015 కోట్ల బకాయిలపై.
  • జాతీయ ఆహార భద్రత చట్టం కింద రాష్ట్రానికి కేంద్రం కేటాయింపులు. ఏపీలో దారిద్య్రరేఖకు దిగువన గ్రామాల్లో 10.96%, పట్టణాల్లో 5.81% ఉన్నారని వెల్లడి.
  • జాతీయ పోలీస్‌ అకాడమీ తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో మధ్య, ఉన్నతస్థాయి జైలు సిబ్బందికి శిక్షణ కోసం జాతీయ ప్రిజన్‌ అకాడమీ ఏర్పాటు
  • విభజన చట్టంలో ఇచ్చిన హామీలు. రామాయపట్నం ఓడరేవు, కడపలో ఉక్కు కర్మాగారం, కాకినాడలో గ్రీన్‌ఫీల్డ్‌ రిఫైనరీ, పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు, విశాఖ-చెన్నై పారిశ్రామిక నడవాకి ఏడీపీ ఇచ్చే రుణాన్ని గ్రాంట్‌గా మార్చడం వంటి అంశాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించనుంది.

ఇతర అంశాలు..

  • శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్స్‌ నుంచి పాలమూరు-రంగారెడ్డి, నక్కలగండి ఎత్తిపోతల పథకాలను తెలంగాణ చేపట్టడాన్ని కర్ణాటక ప్రభుత్వం ఎజెండాలో పెట్టింది.
  • తుంగభద్ర నదిపై ఏపీ ప్రతిపాదిత గుండ్రేవుల ప్రాజెక్టు అంశాన్ని, తెలంగాణ చేపట్టనున్న రాజీవ్‌గాంధీ సంగంబండ బ్యారేజీ అంశాన్నీ కర్ణాటక ఎజెండాలో చేర్చింది.
  • ఇంద్రావతి, కృష్ణా, గోదావరి, పెన్నా, కావేరి నదుల అనుసంధానం అంశాన్ని పుదుచ్చేరి ప్రతిపాదించింది.

ఇదీ చూడండి: WEATHER UPDATE: చెన్నై సమీపంలో తీరం దాటిన వాయుగుండం..ఆ జిల్లాలో భారీ వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.