ETV Bharat / city

'మూడేళ్లలో 30 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తాం' - ap agriculture minister comments on rails of houses

రాష్ట్రంలో పేదలకు మూడేళ్లలో 30 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తామని వ్యవసాయ మంత్రి కన్నబాబు తెలిపారు. ఎన్నికల్లో చెప్పిన వాటి కంటే ఎక్కువ ఇళ్లు నిర్మిస్తున్నామని అన్నారు. కరోనా పరిస్థితుల్లోనూ.. సంక్షేమ కార్యక్రమాలు ఆగలేదని మంత్రి పేర్కొన్నారు.

'మూడేళ్లలో 30 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తాం'

author img

By

Published : Jun 6, 2020, 5:24 PM IST

Updated : Jun 6, 2020, 6:02 PM IST

మేనిఫెస్టోలో కంటే ఎక్కువగా హామీలు నెరవేరుస్తున్నామన్న వ్యవసాయ మంత్రి కన్నబాబు

రాష్ట్రంలో పేదలకు జులై 8న ఇళ్ల స్థలాల పట్టాలు అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. మూడేళ్లలో ఇళ్లు కూడా నిర్మించి ఇస్తామని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో 25 లక్షల ఇళ్లని చెప్పినా.. 30 లక్షల మందికి ఇళ్లిస్తున్నామని పేర్కొన్నారు. కరోనా ఇబ్బంది పెట్టినా సంక్షేమ కార్యక్రమాలు ఆగలేదన్న ఆయన..పేదలకు రైతు భరోసా నుంచి ఇళ్ల వరకు ఇది సాకారం అవుతుందని స్పష్టం చేశారు.

ఇప్పటికే 26.76 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించామని కన్నబాబు తెలిపారు. ఇళ్ల కోసం మరో 6.18 లక్షల దరఖాస్తులు వచ్చాయని అన్నారు. గజం రూ.20 వేలు ఉన్నచోట భూములు కొని పేదలకు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి..

ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగుల క్రమబద్ధీకరణపై కార్యాచరణ ప్రారంభం

Last Updated : Jun 6, 2020, 6:02 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.