నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకిస్తూ జనసేన గళం విప్పుతోంది. పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని దసపల్లా హోటల్లో ఇవాళ యురేనియం వ్యతిరేక అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఈ మేరకు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్, తెలంగాణ నేత, కాంగ్రెస్ మాజీ ఎంపీ హనుమంతరావు హోటల్లో ఏర్పాట్లను పరిశీలించారు. కాంగ్రెస్, తెదేపా, ఎంఐఎం, సీపీఎం, సీపీఐ, తెజస, తెలంగాణ ఇంటిపార్టీ నాయకులు సమావేశంలో పాల్గొంటారని సమాచారం.
ఇదీచూడండి: