ETV Bharat / city

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రాష్ట్రానికి 'స్వచ్ఛ కిరీటాలు' - స్వచ్ఛ సర్వేక్షణ్​లో ఏపీకి అవార్డులు న్యూస్

స్వచ్ఛ సర్వేక్షన్‌ పనితీరులో జాతీయస్థాయిలో ఆరోస్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్‌.... పలు విభాగాల్లో మెరుగైన స్థానాలు సాధించింది. కేంద్రం ప్రకటించిన అవార్డులను రాష్ట్రంలోని పలు నగరాలు, పట్టణాలు దక్కించుకున్నాయి. స్వచ్ఛత దిశగా మరిన్ని అడుగులు వేసేందుకు అవసరమైన శక్తిని అవార్డులు ఇచ్చాయని అధికారులు సంతోషం వ్యక్తం చేశారు.

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రాష్ట్రానికి అవార్డుల పంట.. జాతీయస్థాయిలో ఆరోస్థానం
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రాష్ట్రానికి అవార్డుల పంట.. జాతీయస్థాస్వచ్ఛ సర్వేక్షణ్‌లో రాష్ట్రానికి అవార్డుల పంట.. జాతీయస్థాయిలో ఆరోస్థానంయిలో ఆరోస్థానం
author img

By

Published : Aug 21, 2020, 5:48 AM IST

Updated : Aug 21, 2020, 6:46 AM IST

స్వచ్ఛ సర్వేక్షన్‌-2020 సర్వేలో శుభ్రత, పరిశుభ్రత అంశాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఆరోస్థానంలో నిలిచింది. ప్రధాని, కేంద్ర గృహ పట్టణ వ్యవహారాలశాఖ మంత్రి నేతృత్వంలో వెబ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా... 2019 ఏప్రిల్ నుంచి 2020 జనవరి మధ్యకాలానికి అవార్డులు ప్రకటించారు. శుభ్రత, పరిశుభ్రతకు సంబంధించి... విజయవాడ, తిరుపతి, విశాఖ, చీరాల, ఆత్మకూరు, పలమనేరు, ముమ్మిడివరం నగరాలు పలు విభాగాల్లో అవార్డులు సాధించాయి. జాతీయ స్థాయిలో 10 లక్షలు పైబడిన జనాభా కలిగిన నగరాల్లో నాలుగో ర్యాంకు సాధించిన విజయవాడ... 10 నుంచి 40 లక్షల జనాభా కలిగిన నగరాల్లో అతి పెద్ద శుభ్రమైన నగరంగా అవార్డు సాధించింది. 10 లక్షలు పైబడిన జనాభా ఉన్న నగరాల జాబితాలో విశాఖ తొమ్మిదో ర్యాంకు సాధించింది. లక్ష నుంచి 3లక్షలు జనాభా కేటగిరీలో తిరుపతి దేశంలోనే సుస్థిరాభివృద్ధి కలిగిన చిన్న నగరంగా మొదటి ర్యాంకు సాధించింది. 10 లక్షలు జనాభా ఉన్న నగరాల్లో తిరుపతి ఆరో స్థానంలో నిలిచింది.

50 వేల నుంచి లక్ష జనాభా కలిగిన సుస్థిరాభివృద్ధి ఉన్న చిన్న పట్టణంగా చీరాల దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 25 వేల నుంచి 50 వేల జనాభా కలిగిన ఉత్తమ సుస్థిరాభివృద్ధిగల చిన్న పట్టణంగా ఆత్మకూరు కూడా దేశంలోనే మొదటి ర్యాంకు సాధించింది. 25 వేల లోపు జనాభా కలిగి, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణంగా ముమ్మిడివరం నిలిచింది. దక్షిణ జోన్‌లో 50 వేల నుంచి లక్ష జనాభా కలిగిన ఉత్తమ శుభ్రమైన పట్టణంగా పలమనేరు నిలిచింది. విజయవాడ నగరానికి అవార్డు రావటం వెనక పారిశుద్ధ్య సిబ్బంది, అధికారుల సమష్టి కృషి ఉందని నగర కమిషనర్‌ ప్రసన్న వెంకటేశ్‌ అన్నారు.

50 వేల నుంచి లక్ష జనాభా కలిగిన కేటగిరీలో దక్షిణ జోన్‌ మొదటి 100 ర్యాంకుల్లో 40 ఆంధ్రప్రదేశ్‌కే దక్కాయి. ఒకటి నుంచి 8 ర్యాంకుల్లో వరుసగా పలమనేరు, చీరాల, పుంగనూరు, కందుకూరు, మండలపేట, పులివెందుల, నర్సాపూర్, తణుకు నిలిచాయి. 25 వేల నుంచి 50 వేల జనాభా ఉన్న పట్టణాల కేటగిరీలో 32 పట్టణాలు ఉన్నాయి. మొదటి 10 పట్టణాల్లో 2వ స్థానంలో పుట్టపర్తి 5, 6, 7 స్థానాల్లో జమ్మలమడుగు, నిడదవోలు, రామచంద్రాపురం నిలిచాయి. దక్షిణ మండలంలో లో మొదటి ర్యాంకు సాధించిన పలమనేరు పురపాలిక... జాతీయస్థాయిలో ఉత్తమ పరిశుభ్రమైన పట్టణాల జాబితాలో ఆరో ర్యాంకు సాధించింది. కమిషనర్‌ విజయసింహారెడ్డి, అధికారులు, సిబ్బంది కేక్‌ కోసి సంబరాలు చేసుకున్నారు.

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రాష్ట్రానికి 'స్వచ్ఛ కిరీటాలు'

ఇదీ చదవండి: అత్యంత పరిశుభ్రమైన పెద్ద నగరంగా విజయవాడ

Last Updated : Aug 21, 2020, 6:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.