ఝార్ఖండ్ రాష్ట్ర కొత్త డీజీపీగా గుంటూరు జిల్లాకు చెందిన ఎం.వి.రావ్ నియమితులయ్యారు. ఇవాళ బాధ్యతలు స్వీకరించిన ఆయన... డీజీపీగా సుమారు 18 నెలల పాటు కొనసాగనున్నారు. అత్యంత నిజాయితీ అధికారిగా పేరున్న ఎం.వి.రావ్ పలు కీలక బాధ్యతలు చేపట్టారు. వరంగల్లోని రీజినల్ ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు.
ఈటీవీ భారత్తో ముఖాముఖి..
ఝార్ఖండ్ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన ఎం.వి. రావ్ ఈటీవీ భారత్తో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. అదే సమయంలో ప్రజలకు పోలీసు వ్యవస్థపై మరింత నమ్మకం కలిగేలా పని చేస్తామన్నారు. ఝార్ఖండ్లో నక్సలిజం అతిపెద్ద సమస్య అని...దానిని ఎదుర్కొనేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తామని వెల్లడించారు. మహిళలు, వృద్ధులు, చిన్నారుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపడుతామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి : 'స్థానికం' ఎన్నికల వాయిదాపై తెదేపా - వైకాపా మాటల యుద్ధం