వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పోలీసుశాఖ మరో 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ సూచించారు. ఎందరో ప్రాణాలు కాపాడి... అనేక మందిని పునరావాస కేంద్రాలకు తరలించడంలో పోలీసుశాఖ చొరవ ప్రశంసనీయమన్నారు. లోతట్టు ప్రాంతాలు వరద తీవ్రత అధికంగా ఉండే ప్రాంతాలను ప్రత్యేకంగా పర్యవేక్షించాలని సూచించారు. కలెక్టర్లు,ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో సమన్వయం చేసుకొని పని చేయడం అభినందనీయమన్నారు. డయల్ 100/112 సేవలు వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక