ETV Bharat / city

రాష్ట్ర బడ్జెట్‌ రూ.2,29,779 కోట్లు.. సంక్షేమ పథకాలకు పెద్దపీట

సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం బడ్జెట్‌ను రూపొందించింది. గతేడాది పద్దుతో పోల్చితే కీలక రంగాలకు కేటాయింపులు కొంత మేర పెంచింది. సాగునీటి ప్రాజెక్టులు సహా వ్యవసాయం, పారిశ్రామిక అభివృద్ధి, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు సర్కారు బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చింది.

author img

By

Published : May 20, 2021, 8:13 PM IST

andhrapradesh budget 2021-22
andhrapradesh budget 2021-22

సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ.. 2 లక్షల29 వేల 779 కోట్లతో 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను శాసనసభ ఆమోదించింది. గతేడాది బడ్జెట్‌తో పోల్చితే పలు కీలక రంగాలకు కేటాయింపులు పెంచారు. ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు సహా వ్యవసాయం, పారిశ్రామిక అభివృద్ధి, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చినట్లు పీటీఐ వార్తా కథనం పేర్కొంది.

2021-22 వార్షిక బడ్జెట్ ను శాసన సభలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు. గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ అంచనా 2 లక్షల 24 వేల 789.18 కోట్లు గా ఉండగా.. 2021-22 రాష్ట్ర బడ్జెట్ అంచనా 2 లక్షల29 వేల 779.27 కోట్లు గా నిర్ణయించారు. విభాగాల వారీగా చూస్తే వెనక బడిన కులాల సంక్షేమానికి గత బడ్జెట్ 21 వేల317.24 కోట్లు కేటాయించగా.. ఈ సారి బడ్జెట్ లో 32 శాతం అధికంగా కేటాయింపులు జరిపినట్లు మంత్రి తెలిపారు. వెనుకబడిన కులాల సంక్షేమం కోసం బడ్జెట్‌లో 28 వేల 237 కోట్లు కేటాయించారు. ఈబీసీ సంక్షేమంలో 8 శాతం అధిక కేటాయింపులు పెంచారు. గత బడ్జెట్ లో బడ్జెట్‌ 5 వేల 088.55 కోట్లు కేటాయించగా.. ఈ సారి బడ్జెట్ లో 5 వేల 478కోట్లు నిర్దేశించారు.

రాష్ట్ర బడ్జెట్‌

  • మొత్తం అంచనాలు రూ. 2,29, 779 కోట్లు
  • రెవెన్యూ వ్యయం రూ. 1,82, 196 కోట్లు
  • మూలధన వ్యయం రూ. 47, 582 కోట్లు
  • రెవెన్యూ రాబడి రూ. 1,77, 000 కోట్లు
  • రెవెన్యూలోటు రూ. 5, 000 కోట్లు
  • ద్రవ్యలోటు రూ. 37, 029 కోట్లు

జీఎస్‌డీపీలో ద్రవ్యలోటు 3.49శాతం

జీఎస్‌డీపీలో రెవెన్యూలోటు 0.47శాతం

రాష్ట్ర అప్పులు

  • ప్రస్తుత అప్పులు రూ. 3,55,874 కోట్లు
  • 2021-22 ఆర్థిక సంవత్సరం రూ. 3,87,125 కోట్లు
  • ఈ ఏడాది తెచ్చే రుణాలు రూ. 50,525 కోట్లు
  • ఈ ఏడాది చెల్లించే రుణాలు రూ. 23, 206 కోట్లు

కేటాయింపులు ఇలా..

  • ఈబీసీ సంక్షేమానికి రూ.5,478 కోట్లు
  • కాపుల సంక్షేమం కోసం 3,306 కోట్లు
  • బ్రహ్మణ సంక్షేమానికి రూ.359 కోట్లు
  • ఎస్సీ సబ్‌ ప్లాన్‌కు రూ.17,403 కోట్లు
  • ఎస్టీ సబ్‌ ప్లాన్‌కు రూ. 6,131 కోట్లు
  • మైనార్టీ యాక్షన్‌ ప్లాన్‌ కింద రూ.3,840.72 కోట్లు
  • మైనార్టీ సబ్‌ ప్లాన్‌ రూ.1,756కోట్లు
  • చిన్నారుల కోసం రూ. 16,748 కోట్లు
  • మహిళాభివృద్ధికి రూ. 47, 283 కోట్లు
  • వ్యవసాయ పథకాలకు రూ.11,210 కోట్లు
  • విద్యా పథకాలకు రూ. 24,624 కోట్లు
  • ఆరోగ్య రంగానికి రూ.13,830 కోట్లు
  • విద్యుత్‌ రంగానికి రూ.6,637 కోట్లు
  • కొవిడ్‌పై పోరాటానికి రూ.1000 కోట్లు
  • వైఎస్సార్‌ పెన్షన్‌ కానుకకు రూ.17,000కోట్లు
  • పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు 8,727 కోట్లు
  • రోడ్లు భవనాల శాఖకు రూ. 7,594 కోట్లు
  • వైఎస్సార్‌ సంపూర్ణ పోషణకు రూ.1,556 కోట్లు
  • వైఎస్సార్‌ రైతు భరోసా రూ.3,845 కోట్లు
  • జగనన్న విద్యా దీవెన రూ.2,500కోట్లు
  • జగనన్న వసతి దీవెన రూ.2,223.15 కోట్లు
  • పీఎం ఫసల్‌ బీమా యోజనకు రూ.1,802 కోట్లు
  • డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ చెల్లింపులకు రూ.865కోట్లు
  • జగనన్న చేదోడుకు రూ.300కోట్లు
  • వైఎస్సార్‌ వాహనమిత్రకు రూ.285కోట్లు
  • వైఎస్సార్‌ మత్స్యకార భరోసాకు రూ.120 కోట్లు
  • అర్చకుల ప్రోత్సాహకాలకు రూ .120కోట్లు
  • ఇమామ్స్‌, మౌజంల ప్రోత్సాహకాలకు రూ.80కోట్లు
  • పాస్టర్ల ప్రోత్సాహకాలకు రూ.40కోట్లు
  • ల్యాండ్ రీ సర్వే కోసం రూ.206 కోట్ల

ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 22,610 కరోనా కేసులు, 114 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.