ETV Bharat / city

Andhra-America Marriage: ఆంధ్ర అమ్మాయి, అమెరికా అబ్బాయి...ఏడడుగులతో ఒక్కటైన జంట

author img

By

Published : Feb 11, 2022, 10:58 AM IST

andhra-america marriage: నేటి రోజుల్లో ప్రేమకు ఏదీ అడ్డుకాదని చాలామంది యువత నిరూపిస్తున్నారు. ఒకప్పుడు ప్రేమ వివాహలు ప్రోత్సహించని తల్లిదండ్రులు సైతం.. పిల్లల ఇష్టప్రకారం పెళ్లిళ్లు జరిపిస్తున్నారు. మతాలు వేరే కాకుండా.. దేశాలు వేరైనా పెళ్లి జరిపించిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో జరిగింది. ఇక్కడ అమ్మాయి.. అక్కడి అబ్బాయి మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. మరి అది ఎలా మొదలైందో తెలుసుకుందామా?

Andhra-America marriage
ఆంధ్ర అమ్మాయి, అమెరికా అబ్బాయి వివాహం

andhra girl and america boy marriage: నిజమైన ప్రేమ ఎప్పటికీ ఒడిపోదని చాలా మంది నమ్మే మాట. ఒకప్పుడు ప్రేమ వివాహనికి ఎన్నో సమస్యలు, మరెన్నో అడ్డంకులు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రేమకు కులమతాలతో మాత్రమే కాకుండా దేశాలతో సంబంధం లేకుండా పెళ్లి చేసుకుంటున్నారు. అందుకు పెద్దవాళ్లు సైతం సహకరిస్తున్నారు. తాజాగా ఇలాంటిదే పశ్చిమగోదావరి జిల్లాలో జరిగింది.

ఆంధ్ర అమ్మాయి, అమెరికా అబ్బాయి వివాహం

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కృష్ణాయపాలెంకు చెందిన వెంకటేశ్వరరావు, లక్ష్మి దంపతుల కుమార్తె శ్రావణి, అమెరికా కొలరాడో రాష్ట్రానికి చెందిన హిత్ స్ట్రీట్​ల వివాహం ఘనంగా జరిగింది. హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహ వేడుక నిర్వహించారు.

ఎలా మొదలైంది...

ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2016లో కొయంబత్తూరులో నిర్వహించే యోగా శిక్షణకు ఆమె వెళ్లినట్లు తెలిపింది. అక్కడ హిత్ స్ట్రీట్​తో పరిచయం ఏర్పడి తరువాత స్నేహంగా కొనసాగిందని చెప్పింది. అనంతరం సాఫ్ట్​వేర్​ ఉద్యోగిగా రెండేళ్ల కిందట అమెరికాకు వెళ్లడంతో అది ప్రేమగా మారిందని ఆమె తెలిపింది. అతను అక్కడ మోడలింగ్​లో రాణిస్తున్నాడని, ఇద్దరూ కలిసి ఆ ప్రాంతంలో హఠయోగా క్లబ్ ప్రారంభించారని శ్రావణి తెలిపింది. ఇరు పెద్దల అంగీకారంతో వివాహం చేసుకుని ఒక్కటయ్యామని ఆమె పేర్కొంది. కరోనా నిబంధనల ఈ వివాహనికి పెండ్లికొడుకు తల్లిదండ్రులు రాలేకపోయారని తెలిపింది.

ఇదీ చదవండి:

మెటావర్స్​లో వివాహ రిసెప్షన్.. దేశంలో ఇదే మొదటిసారి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.