ETV Bharat / city

ఎస్‌ఈసీ ప్రొసీడింగ్స్‌ వెనక్కి పంపాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ - ap panchayath elections 2021

ap cs letter to central on sec proceedings

author img

By

Published : Jan 28, 2021, 6:52 PM IST

Updated : Jan 28, 2021, 7:22 PM IST

18:50 January 28

పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్​లపై ఎస్ఈసీ సెన్సూర్ ప్రోసీడింగ్స్​ను వెనక్కు పంపాలని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. రాష్ట్ర పరిధిలో ఉన్న అంశాల్లో పరిధిమీరి ఎస్ఈసీ.. ఈ ప్రొసిడింగ్స్ జారీ చేశారని సిబ్బంది వ్యవహారాల శాఖకు సీఎస్ ఆదిత్యనాథ్​ దాస్ లేఖ రాశారు. వీటిని పరిగణనలోకి తీసుకోవద్దని సీఎస్ లేఖలో కోరారు.  

                  ఇద్దరు ఉన్నతాధికారులపై డీవోపీటీకి ఎస్ఈసీ అవమానకర రీతిలో ఫిర్యాదు చేశారని సీఎస్ పేర్కోన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటర్ల జాబితాను సవరించకపోటాన్ని కారణంగా చూపిస్తూ సెన్సూర్ ప్రోసీడింగ్స్ జారీ చేశారని సీఎస్ ఆ లేఖలో వివరించారు. అఖిల భారత సర్వీసు అధికారుల నుంచి వివరణ కూడా కోరకుండా వారిపై సెన్సూర్ ప్రోసీడింగ్స్ జారీ చేయటం రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధి అతిక్రమణే అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు. సెన్సూర్ అంశం స్వల్ప స్థాయి ఉల్లంఘన మాత్రమేనని.. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని సీఎస్ పేర్కొన్నారు. ఇద్దరు ఐఏఎస్​లను తప్పనిసరి ఉద్యోగవిరమణ చేసేలా చూడాలంటూ సిబ్బంది వ్యవహారాల శాఖకు లేఖ రాయటం తీవ్ర ఆక్షేపణీయమని సీఎస్ ఆ లేఖలో స్పష్టం చేశారు.

              ఎస్ఈసీ అధికార పరిధిని మించి సెన్సూర్ ప్రోసీడింగ్స్​ను జారీ చేయటం సరికాదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు. స్వల్ప స్థాయి ఉల్లంఘనల్ని సర్వీసు రికార్డుల్లో నమోదు చేయాల్సిందిగా ఎస్ఈసీ డీఓపీటీకి లేఖరాయటం రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిలోకి చొరబడటమేనని వివరించారు. ఈ ప్రోసీడింగ్స్​ను ఏపీ ప్రభుత్వం తిరస్కరించిందని.. డీవోపీటీ కూడా దీన్ని పరిగణనలోకి తీసుకోవద్దని సీఎస్ కోరారు. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిలోకి చొరబటం సరికాదన్న విషయాన్ని కూడా ఎస్ఈసీకి తెలియజేయాలని సీఎస్ ఆదిత్యనాథ్​ దాస్ సూచించారు.

ఇదీ చదవండి: ద్వివేది, గిరిజా శంకర్‌ల అభిశంసన

Last Updated : Jan 28, 2021, 7:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.