ETV Bharat / city

ఐఎస్​బీతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం - news on isb

హైదరాబాద్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌తో ఏపీ ప్రభుత్వ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి గౌతంరెడ్డి, ఐఎస్‌బీ ప్రతినిధులు పత్రాలు మార్చుకున్నారు. ప్రభుత్వ శాఖల ఆర్థిక పురోగతిపై ఐఎస్‌బీ.. ప్రభుత్వంతో కలిసి పనిచేయనుంది. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలపైనా ప్రభుత్వంతో కలిసి పనిచేయనుంది.

andhra pradesh  State Government Memorandum of Understanding with ISB
ఐఎస్​బీతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం
author img

By

Published : Aug 5, 2020, 11:59 AM IST

రాష్ట్రంలో ఆర్థిక పురోగతి, ప్రభుత్వ శాఖల్లో సంస్కరణలు, యువతకు ఉపాధి అవకాశాలపై హైదరాబాద్​లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్​తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం మేరకు ఏపీ ప్రభుత్వం ఐఎస్​బీ పాలసీ ల్యాబ్ ఏర్పాటు చేయనుంది. కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వ శాఖలు కోల్పోయిన రెవెన్యూ, అభివృద్ధికి తదుపరి చేపట్టాల్సిన లక్ష్యాలు, తదితర అంశాలపై ఐఎస్​బీ సహకారంతో ఏర్పాటు చేయనున్న ల్యాబ్ పర్యవేక్షణ చేయనుంది. దీంతో పాటు యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలపై రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, ఐఎస్​బీ ప్రతినిధులు ఈ అవగాహన ఒప్పందం పత్రాలను మార్చుకున్నారు. గ్రోత్ ఇంజిన్​గా విశాఖ అభివృద్ధి, రాయలసీమలో ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటు, ప్రోత్సాహకాలు, ఇ-గవర్నర్నెన్స్ తదితర అంశాల్లోనూ పనిచేయనున్నారు.

ఇదీ చదవండి: శుద్ధినీరు.. శుభ్రమైన భోజనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.