ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 9,999 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి., 77 మంది మరణించారు. ఇప్పటివరకు కరోనా బాధితుల సంఖ్య 5,47,686కి చేరింది. మొత్తం ఇప్పటివరకు కరోనా మహమ్మారితో 4,779 మంది చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 96,191 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 24 గంటల వ్యవధిలో 11,069 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో కోలుకున్నా వారి సంఖ్య 4,46,716కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 71,137 కరోనా పరీక్షలు నిర్వహించారు. మొత్తం ఇప్పటివరకు 44,52,128 కరోనా పరీక్షలు చేపట్టారు.
జిల్లాలవారీగా కేసులు..
అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న జిల్లాగా తూర్పుగోదావరి జిల్లా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 1,499 కరోనా కేసులు నమోదయ్యాయి. ప.గో. జిల్లాలో 1,081, చిత్తూరులో 1,040, గుంటూరులో 920, ప్రకాశంలో 901, నెల్లూరులో 778, కడపలో 698, విజయనగరంలో 594, శ్రీకాకుళంలో 570, అనంతపురంలో 557, కర్నూలులో 497, కృష్ణాలో 451, విశాఖలో 413 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి.
జిల్లాలవారీగా మృతులు..
గడిచిన 24 గంటల్లో మహమ్మారితో కడపలో 9 మంది చనిపోయారు. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 8 మంది చొప్పున మృతి చెందారు. గుంటూరు 7, కృష్ణా జిల్లాల్లో ఏడుగురు, అనంతపురం, విశాఖ జిల్లాల్లో ఆరుగురు చొప్పున, విజయనగరం, ప.గో. జిల్లాల్లో ఐదుగురు, తూ.గో. జిల్లాలో నలుగురు, శ్రీకాకుళంలో ముగ్గురు, కర్నూలు జిల్లాలో ఒకరు కరోనాతో చనిపోయారు.