రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 85,283 మందికి పరీక్షలు నిర్వహించగా.. 2,050 మందికి పాజిటివ్‌గా తేలింది. వీటితో కలిపి ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 19,82,308కి చేరింది. తాజాగా.. 18 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 13,531కి పెరిగింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,48,828 కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 19,949 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,51,93,429 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.
కొవిడ్‌తో కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో ఐదుగురు చొప్పున.. తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందగా.. అనంతపురం, ప్రకాశం , విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
తూర్పుగోదావరి జిల్లాలో 375, చిత్తూరులో 324, నెల్లూరులో 221, ప్రకాశంలో 212 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి.. దేశంలో మరో 39వేల కేసులు, 491 మరణాలు