డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఆన్లైన్ ప్రవేశాలను సవాల్ చేస్తూ విద్యార్థుల హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఏ ప్రాతిపదికన డిగ్రీ ప్రవేశాలు చేపడతారో చెప్పాలని పిటిషనర్లు ప్రశ్నించారు. ఇంటర్ పరీక్షల్లో పొందిన మార్కుల ఆధారంగా గతంలో డిగ్రీ ప్రవేశాలు జరిగేవని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఇంటర్ పరీక్షలు జరపలేదన్నారు. ఏ ప్రాతిపదికన డిగ్రీ ప్రవేశాలు చేపడతారో చెప్పాలని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. కౌంటర్ దాఖలుకు ప్రభుత్వ న్యాయవాది సమయం కోరారు. తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా పడింది.
ఇదీ చదవండి: