ETV Bharat / city

దాతల సొమ్ము సరిగా ఉపయోగిస్తే.. మరింత మంది ముందుకొస్తారు..: గవర్నర్​ - Governor assists Singapore Red Cross Society at Raj Bhavan Durbar Hall

కరోనా కష్ట కాలంలో విభిన్న రూపాలలో దాతలు అందిస్తున్న సహకారం మరువలేనిదని గవర్నర్ విశ్వభూషణ్‌ హరిచందన్ అన్నారు. తమ దాతృత్వం సద్వినియోగం అవుతుందన్న నమ్మకం కలిగిస్తే సహకరించేందుకు మరింత మంది ముందుకు వస్తారని సూచించారు. సింగపూర్ రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్రానికి 4.5 కోట్ల విలువైన వైద్య పరికరాలను అందించిందని వివరించారు.

Governor Vishwabhushan Harichandan
గవర్నర్ విశ్వభూషణ్‌ హరిచందన్
author img

By

Published : Jul 1, 2021, 10:33 PM IST

కొవిడ్​ సమయంలో దాతలు అందిస్తున్న సహకారం ఎనలేనిదని గవర్నర్ విశ్వభూషణ్‌ హరిచందన్ కొనియాడారు. రాజ్‌భవన్‌ దర్బార్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో సింగపూర్ రెడ్‌క్రాస్ సొసైటీ నుంచి సమకూరిన 100 ఆక్సిజన్ కాన్సన్​ట్రేటర్లు, 48,000 కొవిడ్ టెస్టింగ్ వయల్స్‌ను రాష్ట్ర రెడ్ క్రాస్ శాఖ ఛైర్మన్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి, ఏకే ఫరిడాలకు అధికారికంగా గవర్నర్​ అందించారు. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ నుంచి 300 ఆక్సిజన్ కాన్సన్​ట్రేటర్లు, నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నుంచి 85 ఆక్సిజన్ కాన్సన్​ట్రేటర్లు, 1400 పల్స్ ఆక్సి మీటర్లు, 20,000 మెడిసిన్ కిట్లు, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా నుంచి, 100 ఆక్సిజన్ కాన్సన్​ట్రేటర్లు, తెలుగు అసోసియేషన్ ఆఫ్ మలేషియా నుంచి 5,000 మెడిసిన్ కిట్లు సమకూరాయన్నారు.

కరోనా రోగులకు సలహా ఇవ్వడానికి రెడ్‌క్రాస్‌ ఉచిత హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసిందని డాక్టర్ శ్రీధర్ రెడ్డి గవర్నర్​కు వివరించారు. సింగపూర్ రెడ్‌క్రాస్ సొసైటీతో పాటు రాష్ట్ర ప్రజలకు అవసరమైన సమయంలో సహాయం అందించిన వివిధ ఎన్నారై అసోసియేషన్లకు, కరోనా రోగులకు సహాయం అందించిన వాలంటీర్లకు గవర్నర్ హరిచందన్ ఈ మేరకు కృతజ్ఞతలు తెలిపారు. గవర్నర్ కార్యదర్శి, భారత రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు ముఖేష్ కుమార్ మీనా, గవర్నర్ సంయుక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఇదీ చదవండీ.. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లలో సాంకేతిక సమస్యల పరిష్కారంపై దృష్టి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.