fisheries co operative: రాష్ట్రంలో 100 హెక్టార్లు, అంతకు పైన విస్తీర్ణమున్న జలాశయాల్లో మత్స్య సంపద వేలంలో వచ్చే సొమ్మును ప్రాథమిక మత్స్యకార సహకార సంఘాలకు(పీఎఫ్‌సీఎస్) ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో సభ్యునికి 30 శాతం లేదా రూ.15 వేల చొప్పున ఏది తక్కువైతే దాన్ని ఇవ్వాలని నిర్ణయించింది. మిగిలిన 70 శాతంలో గ్రామ పంచాయతీకి 10 శాతం, మత్స్యశాఖ(ఏఎఫ్‌సీఓఎఫ్)కు 20 శాతం, జలవనరుల శాఖకు 40 శాతం చొప్పున వాటాలుగా పేర్కొంటూ పశుసంవర్ధక, మత్స్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య ఉత్తర్వులిచ్చారు. 2021 ఆగస్టు 18న జారీ అయిన ఉత్తర్వులకు సంబంధించిన గెజిట్‌ను బుధవారం విడుదల చేశారు. ఎంపిక చేసిన జలాశయాల్లో మత్స్య సంపదను అభివృద్ధి చేసి, ఎక్కువ ఆదాయం సాధించడంతోపాటు వాటి పరిధిలోని వాస్తవ మత్స్యకార సంఘాల జీవనోపాధిని మెరుగు పరచడమే లక్ష్యమని వివరించారు. ఈ మేరకు జలాశయాల వేలానికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేశారు.
ఇదీ చదవండి: చౌకగా మోసం...సన్నబియ్యం కిలో రూ.25.. విదేశాలకు మాత్రమే!!