రాష్ట్రంలో కొవిడ్ రోగుల చికిత్సల్లో పాటించాల్సిన నిబంధనలు, కొవిడ్ నిర్వహణ, కంటైన్మెంట్, నియంత్రణ, వ్యాప్తినిరోధక చర్యలపై సాంకేతిక కమిటీ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ బి.చంద్రశేఖర్రెడ్డి నేతృత్వంలో 10 మంది వైద్య నిపుణులతో కమిటీ వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో కరోనా చికిత్సలకు సంబంధించి చేపట్టాల్సిన ప్రోటోకాల్స్, ఇతర అంశాలపై ఈ సాంకేతిక కమిటీ సిఫార్సులు చేయనుంది.
ఇదీ చదవండి: కొవిడ్ రోగుల కోసం మరో ముందడుగు వేసిన ఉక్కు కర్మాగారం