గుంటూరు జిల్లా తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తన నివాసం నుంచి బకింగ్‌హామ్ కాలువ పక్కనున్న హెలిప్యాడ్‌కు వెళ్లే మార్గంలో భద్రత, అధికారుల బృందాలు మార్పులు చేశాయి. భారతమాత కూడలిలోని బకింగ్‌హామ్ కాలువ వంతెన శిథిలావస్థకు చేరుకున్న కారణంగా ఆర్‌అండ్‌బీ శాఖ మరమ్మతులు చేపట్టింది. ఈ నేపథ్యంలో సీఎం హెలిప్యాడ్‌కు వెళ్లే మార్గాన్ని మార్చారు. గతంలో ముఖ్యమంత్రి తన నివాసం నుంచి 250 మీటర్లు దూరం ప్రయాణించి వంతెన మీదుగా తాడేపల్లిలోని హెలిప్యాడ్‌కు చేరేవారు. ఇప్పుడు 3 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది.
ఆయన ఇంటి వద్ద నుంచి భారతమాత బొమ్మ కూడలి, ఎన్టీఆర్‌కట్ట, ఉండవల్లి కూడలి, కొత్తూరు మీదుగా హెలిప్యాడ్ చేరుకునేలా అధికారులు మార్గాన్ని ఎంపిక చేశారు. ఆ మార్గంలో ఉన్న అడ్డంకుల తొలగింపు పనులను ఆదివారం అయా శాఖల సిబ్బంది చేపట్టారు. సాయంత్రం తాడేపల్లి పోలీసులు, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, మున్సిపల్ అధికారులు సీఎం భద్రత సిబ్బందితో కలసి మార్గాన్ని పరిశీలించారు.
ఇదీ చదవండి: