రాజధాని అంటే వోక్స్‌వ్యాగన్ కాదని తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్... మంత్రి బొత్స సత్యనారాయణను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గెజిట్ ఇవ్వకపోతే 100 రోజుల పాలన ఎక్కడ నుంచి చేశారు..? అని ప్రశ్నించారు. 2014 డిసెంబర్ 30న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశామన్న అనగాని... జీవో నంబరు 254లోనూ గెజిట్ గురించి ప్రస్తావించామని స్పష్టం చేశారు. మంత్రిగా ఉన్న బొత్స అవాస్తవాలు ఎలా మాట్లాడతారని నిలదీశారు.
వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే రాజధాని అంశం తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. వ్యూహాత్మకంగా బొత్స ద్వారా రాజధాని అంశాన్ని మాట్లాడిస్తున్నారన్న ఎమ్మెల్యే... సీఎం మాట్లాడాల్సిన అంశంపై బొత్స ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. రాజధాని అంశంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ కనీసం వివరణ ఇవ్వకపోవటం బాధాకరమని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆగ్రహించారు.
ఇదీ చదవండీ...