locker: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని యూనియన్ బ్యాంకు సిబ్బంది నిర్వాకం బయటకువచ్చింది. వృద్ధుడిని బ్యాంకులోనే ఉంచి తాళం వేసి సిబ్బంది వెళ్లిపోయారు. సోమవారం సాయంత్రం 4.20 గంటలకు కృష్ణారెడ్డి (87) బ్యాంకుకు వెళ్లారు. బ్యాంక్ లాకర్ గదిలోకి వెళ్లిన వృద్ధుడు కృష్ణారెడ్డిని.. గమనించకుండా సిబ్బంది తాళం వేసి వెళ్లిపోయారు. చీకటిపడినా ఇంటికి రాకపోవడంతో కృష్ణారెడ్డి కుటుంబీకులు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
locker: కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలు చూసి బ్యాంకు లాకర్ గదిలో ఉన్నట్లు గుర్తించారు. ఉదయం 10 గంటలకు బ్యాంకు లాకర్ నుంచి ఆ వృద్ధుడిని పోలీసులు బయటకు తీసుకుని వచ్చారు. బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యంపై కృష్ణారెడ్డి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చక్కెర వ్యాధి, రక్తపోటు సమస్యలతో కృష్ణారెడ్డి బాధపడుతున్నారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి: అమానుషం.. కన్నకూతురిపై మూడేళ్లుగా తండ్రి అత్యాచారం