Earthquake in Mundlamuru at Prakasam District: ప్రకాశం జిల్లా మండల కేంద్రం ముండ్లమూరులో ఈ రోజు మధ్యాహ్నం 1.43 గంటలకు స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. సెకనుపాటు పెద్ద శబ్దంతో భూప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఇటీవల కాలంలో ఇక్కడ భూమి కంపించడం ఇది 4వ సారి. దీంతో కార్యాలయాలు, ఇళ్లు, పాఠశాలల నుంచి ప్రజలు, అధికారులు, సిబ్బంది, విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. ఈ సంఘటనలతో ఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
గంటల వ్యవధిలో 4రాష్ట్రాల్లో భూకంపాలు- ప్రజలు పరుగే పరుగు! రిక్టర్ స్కేల్‌పై తీవ్రత ఎంతంటే?
'ఇలాంటి వారిని క్షమించడానికి వీల్లేదు' - బోరుగడ్డ బెయిల్ పిటిషన్ కొట్టివేత