లాక్డౌన్ కారణంగా విడుదల ఆలస్యం అయినందున అమృత రామమ్ సినిమాను ఏప్రిన్ 29న జీ5 యాప్ ద్వారా విడుదల చేస్తున్నట్టు హీరో రామ్ మిట్టకంటి ప్రకటించారు. హీరో స్వగ్రామమైన తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా ముడుపుగల్లు గ్రామంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. లాక్డౌన్ కారణంగా ఆలస్యం అవుతున్నందున సినిమాను జీ5 యాప్ ద్వారా ఆన్లైన్లో విడుదల చేస్తున్నామని, సినిమా ప్రేమికులు యాప్ డౌన్లోడ్ చేసుకొని చూసి ఆదరించాలని కోరారు. ఒక అమ్మాయి.. అబ్బాయి వెంట పడి ప్రేమించే కథను ఇతివృత్తంగా సినిమా తీశామని, షూటింగ్ మొత్తం ఆస్ట్రేలియాలో జరిగిందని రామ్ చెప్పారు. ప్రేక్షకులు ఆదరించాలని ఆయన కోరారు.
ఓటీటీలో ‘అమృతరామమ్’ సినిమా విడుదల - అమృతరామన్ సినిమా విడుదల
సురేందర్ కొంటడ్డి దర్శకత్వంలో రూపొందిన సినిమా అమృత రామమ్. దీన్ని ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5 ద్వారా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.