Amaravati Movement: అమరావతి ఉద్యమం ప్రారంభించి ఈ నెల 4కి 900 రోజులు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఐకాస నేతలు తెలిపారు. జూన్ 4న మందడం శిబిరంలో అమరవీరులకు నివాళులర్పించిన తర్వాత న్యాయ దేవత విగ్రహానికి పాలాభిషేకం చేస్తామని ఐకాస నేతలు వెల్లడించారు. అనంతరం విజయవాడలో అమరావతి పరిరక్షణ సమితి నిర్వహించే సదస్సు 29 గ్రామాల రైతులు పాల్గొంటామని తెలిపారు. అమరావతి పూర్తి చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా ఉద్యమాన్ని మరింత ఉద్ధృతంగా నిర్వహిస్తామని ఐకాస నేత రామారావు చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని అమరావతి పరిరక్షణ ఐకాస అధ్యక్షుడు, కార్యదర్శి శివారెడ్డి తెలిపారు. కోర్టు తీర్పు వచ్చాక కూడా ప్రభుత్వం మూడు రాజధానులంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని మార్చలేరని చెప్పేందుకు 'హైకోర్టు తీర్పు-సర్కారు తీరు' పేరుతో సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. సదస్సుకు సంబంధించిన పోస్టర్ అమరావతి పరిరక్షణ సమితి నేతలు అవిష్కరించారు.
ఇవీ చదవండి: