రాజధాని అంశం మా పరిధిలో లేదని కేంద్రం అనటం సరికాదని అమరావతి ఐకాస ఛైర్మన్ జీవీఆర్ శాస్త్రి అన్నారు. రాజధాని అంశాన్ని విభజన చట్టంలో చేర్చారని గుర్తు చేశారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని, హోంమంత్రిని కలిసి వివరిస్తామని చెప్పారు. అమరావతిపై ఈ సమావేశాల్లో తాడోపేడో తేల్చాలని కోరుతామని స్పష్టం చేశారు.
రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వాల తీరుతో మనోవేదన మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ అనే పదమే అవసరం లేదన్న జీవీఆర్ శాస్త్రి... అన్ని జిల్లాలకు సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయని అన్నారు.
ఇదీ చదవండి
'3 రాజధానులే కావాలంటే.. అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లండి'