నిధుల సమీకరణ కోసం జారీ చేసిన విద్యుత్ బాండ్లకు... వడ్డీ చెల్లించేందుకు రూ.128 కోట్ల మేర మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పాలనా అనుమతులు ఇస్తూ... విద్యుత్ శాఖ కార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారు. ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా... ఈ ఏడాది డిసెంబరు 25 నాటికల్లా చెల్లించాల్సిన విద్యుత్ బాండ్లకు సంబంధించి రూ.25 కోట్ల 83 లక్షలు... జనవరి 8వ తేదీనాటికి గడువున్న బాండ్లకు రూ.103 కోట్ల మేర వడ్డీ చెల్లింపునకు నిధుల మంజూరుకు ప్రభుత్వం అనుమతించింది.
ఇదీ చదవండీ...