విజయవాడలో ఐకాస ఆధ్వర్యంలో భారీ ర్యాలీ విజయవాడలో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రైతులు, కూలీలు, మహిళలు చేపట్టిన నిరసన కార్యక్రమానికి తెదేపా నేతలు దేవినేని ఉమ, బొండా ఉమ మద్దతు తెలిపారు. కొందరు అధికారులు అత్యుత్సాహంతో జీవోలు ఇస్తున్నారని దేవినేని ఆరోపించారు. కార్యాలయాల తరలింపుపై రైతులు న్యాయ పోరాటం చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం వల్ల రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని..
ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని తమ డిమాండ్ అని బొండా ఉమ అన్నారు. విశాఖలో భూముల విలువ పెంచుకునేందుకు కొందరు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మీ పనుల వల్ల రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు వెనక్కి వెళ్లాయని విమర్శించారు.
ఇదీ చదవండి:
సీఎం జగన్కు ముద్రగడ లేఖ.. ఎందుకంటే..?